సర్కారును నిలదీయాల్సిన సమయమిదే

– బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తెలంగాణ నేతన్నల పక్షాన నిలదీయాలని మహారాష్ట్ర నేత నాయకులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్‌ సోమవారం ఒక ప్రత్యేక లేఖను విడుదల చేశారు. తొమ్మిదేండ్లుగా తెలంగాణ నేతన్నలను, చేనేత వ్యవస్థను విచ్చిన్నం చేసి మరలా ఏ విధంగా మహారాష్ట్రలో అడుగుపెడుతున్నాడో అడగాలని సూచించారు. దశాబ్దాలుగా తెలంగాణ నుంచి దేశవ్యాప్తంగా నేతకార్మికులు వలసపోయిన విషయం కేసీఆర్‌కు తెలిసినా వారిని స్వరాష్ట్రానికి తీసుకురావడానికి స్పష్టమైన విధానాన్ని అవలంభించక పోవడం చారిత్రక తప్పిదమని పేర్కొన్నారు. 2017లో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ పైలాన్‌ ప్రారంభించి వలసబోయిన తెలంగాణ నేతన్నలను తిరిగి రప్పిస్తామని చెప్పి ఇప్పటివరకు పదిమంది నేతన్నలకు కూడా పని కల్పించలేదని విమర్శించారు.

 

Spread the love