వచ్చే ఎన్నికలకు బీసీలు సమాయత్తం కావాలి

– 22న రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం బీసీ సంక్షేమ సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వచ్చే సాధారణ ఎన్నికలకు బీసీలు సమాయత్తం కావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి రవి కృష్ణ, కార్యనిరాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ి బీసీలను రాజకీయంగా చైతన్యం చేయటానికి ఈనెల 22న ఉదయం 10 గంటల నుంచి హైదరాబాదులోని సెంట్రల్‌ కోర్ట్‌ హోటల్లో బీసీ సంఘం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీసీలు రాజకీయంగా అనుసరించాల్సిన రాజకీయ వ్యుహన్ని, విధానాన్ని, కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ చైర్మెన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు హాజరవుతారని తెలిపారు. 33 జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు, విద్యార్థి యువజన, మహిళా, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు హాజరు కావాలని కోరారు.

Spread the love