టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌గా జగదీశ్వర్‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌గా ఎన్‌ జగదీశ్వర్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. టీఎస్‌పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీకేజీతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టింది. అందులో భాగంగానే టీఎస్‌పీఎస్సీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌గా బిఎం సంతోష్‌ను గతనెల 21వ తేదీన నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌గా ఎన్‌ జగదీశ్వర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. డిప్యూటేషన్‌పై వచ్చిన ఆయన రెండేండ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఆయన గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో ఓఎస్‌డీగా విధులు నిర్వహిస్తున్నారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించి, జవాబుదారీతనం పెంచి, నియామక ప్రక్రియను బాధ్యతాయుతంగా పూర్తి చేసేందుకు పలు సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగా ఇటీవల అదనంగా టీఎస్‌పీఎస్సీలో పది పోస్టులను మంజూరు చేసింది.

Spread the love