ఎంసెట్‌ ఇంజినీరింగ్‌కు 94.64 శాతం హాజరు

– రేపటితో ముగియనున్న రాతపరీక్షలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో శుక్రవారం ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగం రాతపరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈనెల 14వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు ఎంసెట్‌ కన్వీనర్‌ బి డీన్‌కుమార్‌, కోకన్వీనర్‌ కె విజయకుమార్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి తొలిరోజు ఉదయం నిర్వహించిన మొదటి విడతకు 34,507 మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తే, 32,656 (94.64 శాతం) మంది హాజరయ్యారు. మొదటి విడతకు 1,851 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన రెండో విడతకు 34,242 మంది దరఖాస్తు చేయగా, 32,464 (94.80 శాతం) మంది పరీక్ష రాశారు. రెండో విడతకు 1,779 మంది గైర్హాజర య్యారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ రాతపరీక్షలు ఆదివారంతో ముగియ నున్నాయి. ఈ పరీక్షల నిర్వహణ తీరును ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి, జేఎన్టీయూ హైదరాబాద్‌ వీసీ కట్టా నర్సింహారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.

Spread the love