నవతెలంగాణ – ఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ కేసులో కవిత బెయిల్‌పై తీర్పు రిజర్వ్ చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. మే 6న తీర్పు వెల్లడించనున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. అయితే, లిక్కర్ పాలసీలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితల జ్యుడీషియల్ కస్టడీని మే 7 వరకు పొడగిస్తూ ఢిల్లీ కోర్టు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.