నితిన్‌ గడ్కరీకి అస్వస్థత

నవతెలంగాణ – ముంబయి: కేంద్ర మంత్రి అభ్యర్థి నితిన్‌ గడ్కరీ బుధవారం అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్ర లోని యవత్మాల్‌లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయారు. యవత్మాల్‌-వాశిమ్‌ స్థానం నుంచి మహాయుతి కూటమి తరఫున సీఎం ఏక్‌నాథ్‌ శిందే వర్గానికి చెందిన శివసేన నాయకురాలు రాజశ్రీ పాటిల్‌ పోటీ చేస్తున్నారు. ఆమె తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గడ్కరీ సభలో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కిందపడిపోయారు. ఇతర నేతలు, కార్యకర్తలు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు.  ప్రస్తుతం ఆయనను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.

Spread the love