పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్

– క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో గట్టి నిఘా.
– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
లోక్ సభా ఎన్నికల నేపథ్యంలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో వెబ్ క్యాస్టింగ్ చేపట్టనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాట్లపై బి.ఎస్.ఎన్. ఎల్, ఎస్.ఎన్. ఆర్. ఏజెన్సీ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదనవు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ 1201 పోలింగ్ కేంద్రాల్లో లోపల వెబ్ క్యాస్టింగ్ అలాగే  187 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో  బయట, లోపల భాగంలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వెబ్ క్యాస్టింగ్ పనులు నిర్దేశించిన సమయానికి అందించాలని ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సంబంధిత నోడల్ అధికారిని ఆదేశించారు. అన్ని కేంద్రాల్లో వెబ్ కెమెరాల పర్యవేక్షణకు బి.ఎల్.ఓ, జి.పి. సెక్రెటరీలకు విధులు కేటాయించాలని సూచించారు. పోలింగ్ నిర్వహణలో భాగంగా వెబ్ క్యాస్టింగ్ సిబ్బందికి ఐ. డి కార్డులు  అందించాలని సూచించారు.ఇప్పటికే అన్ని  క్రిటికల్ కేంద్రాలపై  గట్టి నిఘా ఉంచామని అలాగే సంబంధిత ఏజెన్సీ పోలింగ్ కేంద్రాల్లో పనులు చేపట్టాలని బి.ఎస్.ఎం.ఎల్ నెట్ నిరంతరం ఉండాలని ఈ సందర్బంగా సూచించారు. ఈ సమావేశంలో నోడల్ అధికారి డి.పి.ఓ సురేష్ కుమార్, బిఎస్ఎన్ఎల్ డి.ఈ రవి ప్రసాద్, ఎన్నికల పర్యవేక్షకులు శ్రీనివాస రాజు, ఎస్.ఎన్. ఆర్. ఏజెన్సీ  మహేందర్,ఈడియం గఫ్ఫార్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love