వేసవి క్రీడా శిక్షణ శిభిరాలు నిర్వహణ

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లా యువజన క్రీడల కార్యాలయము ఆద్వర్యములో మే 1 నుండి 31 వరకు 14 సంII లోపు  వయస్సు కలిగిన బాల బాలికలకు ప్రాముఖ్యత కలిగిన కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్, వాలీబాల్, బాస్కెట్ బాల్ అలాగే ఇతర క్రీడల నందు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా యువజన, క్రీడల అధికారి కె. జగదీశ్వర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించుటకు ఉత్సాహవంతులైన వ్యాయమ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవని తెలిపారు. సూర్యాపేట జిల్లాలోని ఉత్సాహవంతులైన వ్యాయమ ఉపాధ్యాయులు అలాగ్ సీనియర్ క్రీడాకారులు వారు నిర్వహించదలిచిన క్రీడా వివరములు, గ్రామము, ప్రదేశము తెలియపరుచుచూ పూర్తి వివరాలతో తమ దరఖాస్తులను సమీకృత జిల్లా కార్యాలయాలం నందు ఈ నెల 27 లోపు దరఖాస్తు చేసుకోవలసినదిగా కోరారు. ఇతర వివరాలకు 9490023949 నెంబరుకు సంప్రదించాలని తెలిపారు.
Spread the love