పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం : జూపల్లి

నవతెలంగాణ – నాగర్ కర్నూల్: రాబోయే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సన్నాహ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.. కరువుకు కారణం కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ అంటుండు.. 800 పుస్తకాలు చదివి ఆయనకు మతి భ్రమించిందని ఎద్దేవా చేశారు. వానకాలం తర్వాత మేము అధికారంలోకి వచ్చినం. నీళ్లు లేకుండా రాయలసీమకు తరలించింది మీరు. పదేళ్లలో గుర్తురాని రైతులు ఇప్పుడు గుర్తొచ్చారా..? పదేళ్ల నుంచి నీవు ఎందుకు ఇవ్వలేదు పంట నష్టం. మీ ప్రభుత్వంలో కరువు, పిడుగు పడితే,పంట నష్టం ఇచ్చినట్లయితే నడి బజార్లో నేను ఏ శిక్షకైనా సిద్ధం అని సవాల్ విసిరారు.

Spread the love