- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన పరుష లక్ష్మికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయం అందింది. ఈ సందర్భంగా ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య తన చేతుల మీదుగా చెక్కును అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గించడంలో కల్యాణ లక్ష్మి పథకం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్,బైరంనగర్ సర్పంచ్ వెంకటేశ్వరరాజు, మండల ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, మండల నాయకులు కంతి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



