కోనేరు కోనప్ప మరో కీలక నిర్ణయం

నవతెలంగాణ సిర్పూర్: బీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజీనామా చేశారు. బీఎస్పీతో పొత్తుతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ నెల 14న జిల్లా ఇన్ చార్జి మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నట్టు ఆయన చెప్పారు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డిని కోనప్ప కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసినట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని తనను సీఎం ఆహ్వానించారని ఆయన చెప్పారు. కోనప్పతో పాటు షాహీన్ సుల్తానా, పలువురు నేతలు అధికార పార్టీలో చేరనున్నారు.

Spread the love