కాంగ్రెస్‌లోకి వెళ్దాం.. ఈటలపై కార్యకర్తల ఒత్తిడి

Let's go to Congress.. Activists' pressure on spears– బీజేపీలో ఉంటే కేసీఆర్‌ను ఎదుర్కోలేం ొ రాజగోపాల్‌రెడ్డితో కలిసి నేడు ఢిల్లీకి ఈటల
– అమిత్‌షా, నడ్డాతో భేటీ కానున్న రాజేందర్‌ ొ తుది నిర్ణయం వెలువరించే అవకాశం?
రాష్ట్రంలో బీజేపీ కకావికలమవుతున్నది. సద్దుమణిగిందనుకున్న అంతర్గత పోరు మళ్లీరాజుకుంది. క్రమంగా బీజేపీ గ్రాఫ్‌ పడిపోతున్న నేపథ్యంలో కొత్తగా ఆ పార్టీలో చేరిన నేతలు పునరాలోచనలో పడ్డారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తాజాగా ఆపార్టీలో అగ్గిరాజేశారు. పార్టీ మారే విషయాన్ని తమంట తాము చెప్పకుండా క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో అనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ‘కాంగ్రెస్‌లోకి పోదాం…బీజేపీలో భవిష్యత్తు లేదు’ అంటూ ఈటల, కోమటిరెడ్డిపై కార్యకర్తలు బహిరంగానే తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ హఠాత్‌ పరిణామం నుంచి బీజేపీ నేతలు తేరుకోలేకపోతున్నారు.
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా కమలాపురం మండలానికి వెళ్లిన ఈటలకు ఉహించని షాక్‌ తగిలింది. ఆయన స్థానిక కార్యకర్తలతో మాట్లాడుతున్న సమయంలో అత్యధిక మంది కార్యకర్తలు కాంగ్రెస్‌లోకి పోవాలని డిమాండ్‌ చేసినట్టు తెలిసింది. దీంతో ఆయన హుజురాబాద్‌ నియోజకవర్గంలోని మండలాల కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోకుంటానని ప్రకటించారు. ఇదే పరిస్థితులు మునుగోడు నియోజకవర్గంలోనూ నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈటల, రాజగోపాల్‌రెడ్డి శుక్రవారం హస్తినకు వెళ్లుతున్నట్టు తెలుస్తోంది. ఏ లక్ష్యం కోసమైతే బీజేపీలో చేరామో, అది నెరవేర్చకపోవడంతో అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు ఢిల్లీకి పయనమవుతున్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్‌ను దించేందుకు కార్యచరణ ఏంటనే విషయాన్ని ఢిల్లీలోనే తేల్చుకునే అవకాశం ఉన్నది. జాతీయ నాయకులు సంతృప్తికరమైన సమాధానం చెప్పితే పార్టీలో కొనసాగే విషయాన్ని ఆలోచిస్తామనీ, లేకపోతే తమ భవిష్యత్తును పునరాలోచించుకుంటామని కార్యకర్తలను సముదాయించినట్టు వారి అనుచరులు చెబుతున్నారు. గతంలో బీజేపీ మాజీ అధ్యక్షులు బండి సంజరుకుమార్‌, ఈటల, కోమటిరెడ్డి మధ్య తీవ్రమైన అంతర్గత పోరు కొనసాగింది. అనుహ్య పరిణామాల రిత్యా ఆయన్ను మార్చడంతో అంతర్గత విభేదాలు సద్దుమణిగాయని అంతా భావించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఈటలకు ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ బాధ్యతలు అప్పజెప్పి… కోమటిరెడ్డిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. దీంతో బీజేపీ కార్యక్రమాలు సాఫీగా సాగుతాయని అందరూ అనుకున్నారు. కానీ కథ మళ్లీ మొదటికొచ్చింది. అయితే ఈసారి నాయకుల నుంచి కాకుండా
కార్యకర్తల రూపంలో సెగ తగులుతున్నది. నాయకులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నా…కార్యకర్తలు మాత్రం తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో తమ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిందని వారు వాపోతున్నారు. తెలంగాణలో బీజేపీ బలహీనపడుతున్న క్రమంలో వారిలో అంతర్మథనం మొదలైనట్టు కనిపిస్తున్నది. అందుకే బీజేపీని వీడి కాం గ్రెస్‌లో చేరుదామని కార్యకర్తలు అంటున్నారు. బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొవడం బీజేపీకి సాధ్యం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పాత నేతలకు, బీజేపీలో కొత్తగా చేరిన నాయకులకు మధ్య విభేదాలు తీవ్రం గా ఉన్నాయి.ఈ నేపథ్యంలో బీజేపీని వీడి కాంగ్రెస్‌లో పార్టీలో చేరాలని, బీఆర్‌ఎస్‌ను ఓడించాలని కార్యకర్తలు నేతలపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది.

Spread the love