ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకుందాం

– డీలిమిటైజేషన్‌కు వ్యతిరేకంగా ఐక్యపోరు : పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ చెప్పారు. డీలిమిటైజేషన్‌కు వ్యతిరేకంగా జరిగే ఐక్యపోరులో అందరూ కలిసిరావాలని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల శిక్షణతరగుతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెడుతున్నదని విమర్శించారు.
కార్పొరేట్ల కోసమే ప్రభుత్వ రంగ సంస్థలకు ఆర్డర్లు, నిధులు ఇవ్వకుండా జాప్యం చేస్తోందన్నారు. ఇన్సూరెన్స్‌, రైల్వే, రక్షణ వంటి రంగాల్లోని ప్రయివేటు పెట్టుబడులు దేశానికే ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌, నాయకులు చెన్నకేశవులు, ఎ.బాపూరావు, ఎ.యాదగిరి, టి.సత్తయ్య, కాశీరెడ్డి, శ్రీధర్‌, శ్రీను, తదితరులు పాల్గొన్నారు

Spread the love