ఉమ్మడి వరంగల్ జిల్లా మహాసభవిజయవంతం చేయండి

నవతెలంగాణ – గోవిందరావుపేట
జూన్ 4వ తారీఖున హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించే ఉమ్మడి వరంగల్ జిల్లా మహాసభను ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మహాజన సోషలిస్టు పార్టీ ములుగు జిల్లా ఇన్చార్జ్ ఇరుగుపైడి పిలుపునిచ్చారు.సోమవారం మండలంలోని పసర గ్రామంలో ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో ఎం ఎస్ పి పార్టీ అనుబంధ సంఘాల మండల ఇన్చార్జి పేరాల బలరాం అధ్యక్షతన ఎం ఎస్ టి ఎమ్మార్పీఎస్ మండల అనుబంధ సంఘాల అత్యవసర సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎం ఎస్ పి ములుగు జిల్లా ఇన్చార్జి ఇరుగుపైడి మరియు ఎం ఎస్ పి ములుగు జిల్లా సీనియర్ నేత మడిపల్లి శ్యాంబాబులు హాజరై మాట్లాడారు. ముందుగా ఉమ్మడి వరంగల్ జిల్లా మహాసభలకు సంబందించిన కరపత్రాలను నాయకులు ఆవిష్కరించడం జరిగింది.అనంతరం ఇరుగుపైడి మరియు మడిపల్లి శ్యాంబాబులు మాట్లాడుతూఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్దత సాధన కోసం సుదీర్ఘ కాలంగా నడుస్తున్న ఉద్యమం కీలక దశకు చేరుకుందని అన్నారు.గత కొన్ని రోజులుగా ఎస్సీ వర్గీకరణను నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన బీజేపీ కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేస్తూ తీర్మానం చేయడం, అలాగే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎస్సీ వర్గీకరణ చట్టబద్దత పట్ల సానుకూల ప్రకటన చేయడం శుభపరిణామం అని అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలోకి వచ్చి రూట్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేశంలో ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉందని , ఈ సమయంలో మాదిగ ప్రజలంతా ఏకమై ఉద్యమాన్ని ఉదృతం చేద్దామని అన్నారు.అందుకోసమే ఊరూరా మాదిగ ప్రజలను కదలించడానికి ఉమ్మడి జిల్లా మహాసభలను నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే జూన్ 4 వ తేదీన ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియం ప్రాంగణంలో ఉమ్మడి వరంగల్ జిల్లా బహిరంగ సభను నిర్వహిస్తున్నామని , ఈ సభలో ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. కావున ఈ సభను విజయవంతం చేయడానికి ములుగు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామం నుండి మాదిగ, ఉప కులాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి.,ఎం.ఆర్.పి.ఎస్ అనుబంధ సంఘాల నాయకులు తిక్క దుర్గారావు,తోకల రాంబాబు,పసుల భద్రయ్య,ఎనిగందుల మొగిలి, నీలాల మల్లేష్, మునిగాల సాంబయ్య,అనిల్, తిప్పనపల్లి చింటూ,కోతి సుధాకర్,వేల్పుల సందీప్, సుంచు రాజేష్,సుంచు యాకోబు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love