సీవీసీగా విజిలెన్స్‌ కమిషనర్‌గా శ్రీవాస్తవ ప్రమాణం స్వీకారం

నవతెలంగాణ – ఢీల్లి: కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌గా ప్రవీణ్‌కుమార్‌ శ్రీవాస్తవ ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ సోమవారం ప్రకటన విడుదల చేసింది. సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌గా సురేశ్‌ ఎన్‌ పటేల్‌ పదవీకాలం గతేడాది డిసెంబర్‌లో ముగిసింది. ఆ తర్వాత ఆయన తాత్కాలిక సీవీసీగా పని చేస్తుండగా.. ప్రస్తుతం పూర్తిస్థాయి సీవీసీగా నియమించింది. ఇవాళ రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 10.30 గంటలకు ఆయన ప్రమాణం చేశారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీవాస్తవ అస్సాం-మేఘాలయ కేడర్‌కు చెందిన 1988-బ్యాచ్ (రిటైర్డ్) ఐఏఎస్‌ అధికారి. గత ఏడాది జనవరి 31న కేబినెట్ సెక్రటేరియట్ కార్యదర్శి (కోఆర్డినేషన్)గా పదవీ విరమణ చేశారు. ఆయన ఈ పదవిలో నాలుగేళ్ల పాటు కొనసాగనున్నారు.

Spread the love