పది ఫలితాల్లో మల్హర్ 100 శాతం

– మండల టాపర్ గా తాండ్ర నక్షత్ర
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ పదోవతరగతి పలితాలు విడుదల చేసిన నేపథ్యంలో మండలంలోని  మొత్తం 165 విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 165 మంది విద్యార్థులు ఉత్థిర్ణులై 100 శాతం సాధించారు.ఎడ్లపల్లి ఆదర్శ పాఠశాలలో 68 విద్యార్థులకు  అందరూ ఉత్తీర్ణులై 100 శాతం సాధించారు. దుబ్బపెటలో  కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో 25 మంది విద్యార్థులకు అందరూ ఉత్తీర్ణులై 100 శాతం సాధించారు.మల్లారం జిల్లా పరిషత్ పాఠశాలలో 17 మందికి అందరూ ఉత్తీర్ణులై 100 శాతం సాధించారు. వల్లేoకుంట జిల్లా పరిషత్ పాఠశాలలో 6 మందికి అందరూ ఉత్తీర్ణులై 100 శాతం సాధించారు.పెద్దతూoడ్లలో 2 మందికి అందరూ ఉత్తీర్ణులై 100 శాతం సాధించారు.తాడిచెర్లలో 47 మంది విద్యార్థులకు 46 మంది ఉత్తీర్ణులై 100 శాతం సాధించారు.అయితే తాడిచెర్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న తాండ్ర నక్షత్ర 9.5 జీపీఏ సాధించి మండల టాపర్ గా నిలిచింది.ఇందుకు నక్షత్రను పలువురు ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు అభినందించారు.
Spread the love