తెలంగాణకు మణిహారం ఆయిల్ఫెడ్ నూనె పరిశ్రమలు..

– ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మొదటిది అశ్వారావుపేట కర్మాగారం..
– సామర్ధ్యం పెంపు దిశగా  పామాయిల్ ఫ్యాక్టరీలు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1990 వ, దశకంలో ప్రారంభం అయిన పామాయిల్ సాగును ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా ప్రోత్సహిస్తోంది. పంట సాగుపై రైతుల అవగాహన కల్పిస్తూ రాయితీలు ఇస్తోంది.రాష్ట్రంలో విస్తరిస్తున్న పామాయిల్ సాగుకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ క్రస్సింగ్  సామర్థ్యాన్ని పెంచుకుంటూ దినదినాభివృద్ధి చెందుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఖమ్మం జిల్లా, అశ్వారావుపేటలో రెవిన్యూలో 2006 లో మొదటిగా ఆయిల్ఫెడ్ నిర్వహణలో గంటకు 5 టన్నులు గానుగ ఆడే సామర్ధ్యంలో ఒక పరిశ్రమను నిర్మించారు. ఈ పరిశ్రమ 2007 లో గానుగ ఆడటం ప్రారంభించారు. సాగు విస్తరించడం గెలలు అధిక దిగుబడి రావడంతో 10 టన్నుల సామర్ధ్యంంతో 2010 పరిశ్రమను విస్తరించారు.అలాగే 2013 లోనూ 15 టన్నుల సామర్ధ్యానికి పరిశ్రమ విస్తరించారు.2015 లో 30 టన్నుల సామర్ధ్యం పెంచుతూ పునరుద్ధరించారు.ప్రస్తుతం సరాసరి ప్రతీ ఏడాది ఒక లక్షా మెట్రిక్ టన్నుల గెలలు నుండి ముడి నూనెను తయారు చేస్తున్నారు. 2024 – 25 ఆర్ధిక సంవత్సరంలో అదనంగా 60 టన్నుల గెలలు గానుగ ఆడే సామర్ధ్యంంతో మరొక పరిశ్రమను నూతనంగా నిర్మించడానికి ఆయిల్ఫెడ్ బోర్డ్ సన్నాహాలు చేస్తుంది.ఇందుకోసం 2023 – 24 ఆర్ధిక సంవత్సరంలో ఈ పరిశ్రమ పనిచేయడానికి కావాల్సిన బాయిలర్,ఈ.టీ.పీ లను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వీటి పనులు శరవేగంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగు విస్తరించడం, అశ్వారావుపేటలో పరిశ్రమ తరుచూ మరమ్మత్తులకు గురికావడంతో 2017 లో ప్రత్యేక తెలంగాణ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,దమ్మపేట మండలం అప్పారావుపేట 30 టన్నుల సామర్ధ్యంంతో మరో పామాయిల్ ఫ్యాక్టరీ ని నిర్మించారు.దీన్నే 2020 లో 45 టన్నుల గెలలు సామర్ధ్యం తో విస్తరించారు.అలాగే 2022 లో మరో 60 టన్నుల సామర్ధ్యం పెంపుదల చేసారు. భవిష్యత్తులో మరో 90 టన్నుల సామర్ధ్యం పెంపుదలకు సన్నాహాలు చేస్తున్నారు.ఇందుకు గాను బాయిలర్ పనులను ప్రారంభించారు. ఈ పరిశ్రమలు పామాయిల్ గెలలు ను క్రస్సింగ్ చేయడమే గాక వందలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ పరిశ్రమలు కాలుష్య నియంత్రణ మండలి నియమాలకు లోబడి అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో నిర్మించడం జరుగుతుందని,ఈ కారణం చేత కాలుష్యం నియంత్రణలో బాగం పంచుకుంటాయి అని అశ్వారావుపేట,అప్పారావుపేట మేనేజర్ లు బాల క్రిష్ణ, కళ్యాణ్ గౌడ్ లు తెలిపారు.
Spread the love