కేజ్రీవాల్‌, సొరెన్ అరెస్టుకు నిర‌స‌న‌గా మెగా ర్యాలీ

నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్‌ల‌ను ఈడీ అరెస్ట్ చేసినందుకు నిర‌స‌న‌గా విప‌క్ష ఇండియా కూట‌మి రాంచీలో ఆదివారం మెగా ర్యాలీ నిర్వ‌హించ‌నుంది. ఉలుగుల‌న్ న్యాయ్ ర్యాలీ పేరిట జ‌రిగే ఈ ర్యాలీకి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఆ పార్టీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ స‌హా 14 మంది విప‌క్ష నేత‌లు హాజ‌రుకానున్నారు. రాంచీలోని ప్ర‌భాత్ తారా గ్రౌండ్‌లో జ‌రిగే ఈ ర్యాలీకి దాదాపు 5 ల‌క్ష‌ల మంది హాజ‌రవుతార‌ని అంచ‌నా. లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో జేఎంఎం ఈ భారీ ర్యాలీని నిర్వ‌హిస్తోంది. పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్‌, ఆర్జేడీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ చీఫ్ ఫ‌రూక్ అబ్దుల్లాతో పాటు హేమంత్ సొరెన్ భార్య క‌ల్ప‌నా సొరెన్ ఈ ర్యాలీని ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. ఇక ర్యాలీ సంద‌ర్భంగా రాంచీ అంత‌టా సోనియా, రాహుల్‌, కేజ్రీవాల్, మ‌మ‌తా బెన‌ర్జీ, హేమంత్ సొరెన్‌, క‌ల్ప‌నా సొరెన్‌ల నిలువెత్తు క‌టౌట్లు, భారీ బ్యాన‌ర్లు వెలిశాయి.

Spread the love