తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయమే దశాబ్ది ఉత్సవాలు ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, మార్కెట్‌

కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి
నవతెలంగాణ-తలకొండపల్లి
తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయమే దశాబ్ది ఉత్సవాలు అని ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమాన్ని మండలంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గురువారం మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో ఎన్నో మార్పులకు నాంది పలికారని అదే మాదిరిగా త్వరలో రాష్ట్రంలోని అన్ని మండలాల్లో దశాబ్ది ఉత్సవాలు పేరిట పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కసరత్తు జరుగుతుందన్నారు. మండలంలోని ఆర్‌అండ్‌బి, వ్యవసాయం, పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌, విద్య, వైద్యం, అటవీ శాఖ, మహిళ గ్రూపులు, అంగన్వాడీ తదితర శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల అధికారులతో తమ తమ శాఖలో మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. దేశంలోనే మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలకు కేరాఫ్‌ అడ్రస్‌ గా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని ఆయన అన్నారు. మండలంలో బీటి రోడ్ల రెన్యువల్‌ కోసం సుమారు రూ.10 కోట్లు మంజూరు చేయించామని, నూతనంగా 9 పంచాయతీలకు గాను 20 లక్షల చొప్పున, నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలకు 22రోడ్ల నిర్మాణం కోసం నిధులు, 37 పల్లె దవాఖానాలు, రాష్ట్రంలో 1001 రెసిడెన్షియల్‌ కాలేజీలు, స్కూల్‌, కల్వకుర్తిలో వంద పడకలు, అమనగల్‌లో 50 పడకలు ఆస్పత్రిని తీర్చిదిద్దామన్నారు. నియోజవర్గంలో 650 చెరువులు, పూడికతీత కట్ట మరమ్మతులు, ఇతర పనులు పూర్తి చేసినట్టు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ ఎంపీపీ సిఎల్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, తహసిల్దార్‌ కృష్ణ, ఎంఈఓ రాజు, ఎంపీడీవో, రాకేష్‌ ,విద్యాసాగర్‌ పవన్‌ తో పాటు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love