నాటో విస్తరణతో ప్రపంచ శాంతి, సుస్థిరతకు ముప్పు

– మలేషియా విశ్లేషకులు
కౌలాలంపూర్‌ : ప్రచ్ఛన్న యుద్ధం తరువాత జరిగిన నాటో విస్తరణతో ప్రపంచ శాంతి, సుస్థిరత ప్రమాదంలో పడ్డాయని మలేషియాకు చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లీపీ మే విమర్శించారు. యూరప్‌ భాగస్వాములతో ఏర్పడిన నాటో ఇప్పడు పూర్తిగా అమెరికా చేతిలోకి వెళ్లిపోయిందని, ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఇంటర్నేషనల్‌ ఇస్లామిక్‌ యూనివర్శిటీలో పనిచేసే లీ లీ మే తెలిపారు.
నాటో తన సభ్యులందరి ప్రయోజనం కోసం కాకుండా.. కేవలం అమెరికా ప్రయోజనాల రక్షణ కోసమే ఎలా రూపాంతరం చెందిందో అందరం చూస్తూనే ఉన్నామని అన్నారు. నాటో ఇప్పుడూ ఆసియాలోకి కూడా చొచ్చుకుపొయిందని, చైనాకు వ్యతిరేకంగా అమెరికా తన ప్రయత్నాలకు నాటోను ఉపయోగించుకుంటుందని విమర్శించారు. అయితే చైనాను ప్రత్యర్థిగా చూపాలనే నాటో ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగలిందని అన్నారు.

Spread the love