– తొలి ప్రధాని పేరును తొలగించిన కేంద్రం
న్యూఢిల్లీ : ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ పేరును ప్రధానమంత్రుల స్మారక చిహ్నంగా మోడీ ప్రభుత్వం మార్చి వేసింది. బుధవారం నుంచి కొత్త పేరు అమలులోకి వచ్చింది. నెహ్రూ మరణానం తరం అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయన నివాసాన్ని స్మారకచిహ్నంగా మార్చింది. కానీ ఇప్పుడు ప్రధాన మంత్రుల సంగ్రహాలయంగా మోడీ ప్రభుత్వం మార్చిది.
చరిత్రను వక్రీకరించడమే : కాంగ్రెస్
నెహ్రూ మెమోరియల్ మ్యూజియం మరియు లైబ్రరీ (ఎన్‌ఎంఎంఎల్) పేరు మార్పుపై కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ చర్య చరిత్రను వక్రీకరించడమేనని తెలిపింది. ప్రధాని మోడీ దృష్టిలో పి అంటే ప్రాముఖ్యత లేనిది, అల్పమైనది అని అర్థమని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
నెహ్రూ వారసత్వాన్ని తిరస్కరించడం, వక్రీకరించడం, పరువుతీయడం, నాశనం చేయడం అనే అజెండాతో బీజేపీ ఉందని విమర్శించారు. ప్రజాస్వామ్య, లౌకిక, శాస్త్రీయ పునాదులను నిర్మిచడంలో ఆయన సాధించిన అత్యున్నత విజయాలను ఎప్పటికీ ఎవరూ చెరిపివేయలేరని అన్నారు.