– కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఖర్గే
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే నేతృత్వంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్‌లో పలువురు బీఆర్‌ఎస్ నేతలు చేరారు. గురువారం నిజామాబాద్‌కి చెందిన సునీల్ రెడ్డి, గద్వాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సరిత, మార్కెట్ కమిటీ మాజీ చైర్‌పర్సన్ బండ్ల లక్ష్మీదేవి, సర్పంచులు పలువురు నేతలు చేరారు. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి మల్లికార్జున ఖర్గే ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఎన్నికల కమిటీ చైర్మెన్‌గా రేవంత్ రెడ్డి
ప్రకటించిన ఏఐసీసీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఈ ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి చైర్మెన్‌గా ఎన్నికల కమిటీని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎన్నికల కమిటీ ప్రతిపాదనలను ఆమోదించారని గురువారం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల కమిటీలో చెర్మెన్‌తో సహా మొత్తం 26 సభ్యులు, ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులను నియమించింది.