హైదరాబాద్ : ఇమేజింగ్ టెక్నాలజీ అగ్రగామి సంస్థ నికాన్ ఇండియా తమ సరికొత్త మిర్రర్‌లెస్ ఇమేజింగ్ మాస్టర్ పీస్ నికాన్ జడ్8ను ప్రదర్శించింది. గురువారం హైదరాబాద్‌లో దీన్ని ఆ కంపెనీ ఎండి సజ్జన్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇమేజింగ్ ల్యాండ్‌స్కేప్‌ను ఒక మెట్టు పైకి తీసుకెళ్లేలా ఇది రూపొందించబడిందన్నారు. దీని ధరను రూ.3.44 లక్షలుగా నిర్ణయించామన్నారు. ఇది హై స్పీడ్ ఫ్రేమ్ క్యాప్చర్‌లో ప్రతిబింబిస్తుందన్నారు. 12 బిట్ అంతర్గత 8కె వీడియో రికార్డింగ్, 120ఎఫ్‌పిఎస్ వరకు బరస్ట్ స్పీడ్, అత్యంత అధునాతన ఆటో ఫోకస్ సిస్టమ్ వంటి కీలక ఫీచర్లతో దీన్ని రూపొందించామన్నారు.