ఒకప్పుడు పండ్లు అంటే కాలాలను బట్టి అందుబాటులో ఉండేవి. టెక్నాలజీ పెరిగిన తర్వాత కాలాలతో సంబంధం లేకుండా పండ్లు విరివిగా అందుబాటులో ఉంటున్నాయి. సీజన్‌కు కొంచెం అటు ఇటుగా ఈ మధ్య కివి కూడా అందుబాటులో ఉంటోంది. ఇందులో అనేక పోషకాలున్నాయి. అనేక రకాల అనారోగ్య సమస్యలు దరి చేరకుండా చేస్తుంది కూడా. ఇందులో ఉండే పోషకాలేంటో చూద్దాం..
మన శరీరంలో ఉండే అనవసరపు టాక్సిన్‌లని అరికట్టాలంటే కివి పండును ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది.
కివిలో ఉండే పొటాషియంతో గుండె సమస్యలు దూరమవుతాయి. రోజుకి నాలుగు మిల్లీగ్రాముల పొటాషియం తీసుకునేవారు.. హద్రోగ సమస్యల బారినపడే అవకాశం చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు.
అధిక రక్తపోటుతో బాధపడే వారు.. కివి పండుని ఆహారంలో భాగంగా తీసుకుంటే ఎంతో మంచిది.
ఇందులో వుండే యాక్టినిడిన్ ఎంజైమ్ జీర్ణాశయాన్ని ఉత్తేజపరుస్తుంది. అలాగే ఆహారాన్ని బాగా అరిగేలా చేస్తుంది.
కివిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన కంటి టిష్యూలు, కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఇందులోని విటమిన్ కె, కాల్షియమ్‌లు వివిధ రకాల ఎముక సమస్యలు అదుపు చేయ గలుగుతాయి.
వేరే పండ్లతో పోల్చితే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ స్థాయిలో ఉండడం వల్ల షుగర్ ఉన్నవారు కూడా దీన్ని తీసుకోవచ్చు.
ఇందులో వుండే విటమిన్ సి శరీరంలో చర్మాన్ని ఇబ్బంది పెట్టె సెల్స్‌తో పోరాడుతుంది.
ఈ పండులోని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, హై ఫైబర్ కంటెంట్ మొదలైనవి మన శరీరంలో కొవ్వుని పేరుకు పోకుండా చేస్తాయి. దాంతో బరువు నియంత్రణలో వుంటుంది.