ఆస్కార్‌కు అర్హతలేని సినిమాలు

రెండు ఆస్కార్‌ పురస్కారాలను కైవసం చేసుకుని యావత్‌ భారతదేశం గర్వపడుతున్న తరుణంలో ఆస్కార్‌ విజేత, సంగీత దర్శకుడు ఏ.ఆర్‌. రెహ్మాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దేశం నుంచి ఆస్కార్‌కి పంపిస్తున్న సినిమాలపై ఓ ఛానెల్‌లో కామెంట్స్‌ చేశారు. ఇప్పుడీ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ‘కొన్ని సార్లు మన సినిమాలు ఆస్కార్‌ వరకు వెళ్లి నిరాశతో వెనక్కు వస్తున్నాయి. అర్హత లేని సినిమాలను ఆస్కార్‌కు పంపిస్తున్నారు. అలాంటప్పుడు చూస్తుండటం తప్ప మనం ఏమి చేయలేం’ అని అన్నారు. అర్హత ఉన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని కాకుండా గుజరాతి సినిమా ‘ఛెల్లో షో”ని ఆస్కార్‌ కోసం విదేశీ సినిమా విభాగంలో ప్రభుత్వం పంపడాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్టు తేట తెల్లమవుతోంది. 95వ ఆస్కార్‌ పురస్కారాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని నాటు..పాట, ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ షార్ట్‌ ఫిల్మ్‌ ఆస్కార్‌లను దక్కించుకుని విజయకేతనం ఎగురవేశాయి.

Spread the love