జూన్‌ 2న సోనియా చిత్రపటానికి పాలాభిషేకం

మధుయాష్కీగౌడ్‌ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించిన ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ చిత్రపటానికి జూన్‌ 2న పాలాభిషేకం చేయా లని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్‌ మధుయాష్కీగౌడ్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఆ నెలలో 20 రోజు లపాటు కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానా లను ఏవిధంగా విస్మరించిందో ప్రజలకు వివరిస్తామన్నారు. శుక్ర వారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ అధ్యక్షు లు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీని యర్లతో సమావేశమయ్యారు. అనంతరం మధు యాష్కీ విలేకర్లతో మాట్లాడుతూ ఇక నుంచి ప్రతి నెల మొదటి వారంలో పార్టీ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రా న్ని దోచుకుని, దాచుకున్న కేసీఆర్‌ కుటుంబం రాష్ట్ర ప్రజలను విస్మరించిందన్నారు. గతంలో ఆంధ్రా వాళ్ళు దోచుకున్నారని విమర్శలు చేసిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడు వాళ్లకే దోచిపెడుతున్నారని ఎద్దేవా చేశారు. రానున్న కాలంలో ఇరవై రోజులపాటు ప్రతీ ఇంటిపై కాంగ్రెస్‌ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. త్వరలో బీసీ గర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయను న్నట్టు తెలిపారు. ఈ సభకు కర్నాటక సీఎం సిద్ద రామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ఆహ్వానిస్తామన్నారు. అంబేద్కర్‌ విగ్రహాన్ని చూపిస్తూ కేసీఆర్‌ దళితులను మోసం చేసే విధానాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు.
పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నాం : ఉత్తమ్‌
పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవా న్ని కాంగ్రెస్‌ పార్టీ బహిష్కరిస్తున్నట్టు ఎంపీ ఎన్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చెప్పారు. మోడీ భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారని విమర్శించారు. భవన ప్రా రంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానిం చకపోవడం దారుణమని చెప్పారు. పార్లమెంట్‌ భవన శంకుస్థాపన సమయంలో కూడా ఆనాటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఆహ్వానించ లేదని గుర్తు చేశా రు. ప్రజస్వామ్య వ్యవస్థను ప్రధాని కించపరుస్తున్నా రని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ పార్లమెంట్‌కు రావడం అరుదుగా జరుగుతున్నదని ఎద్దేవా చేశారు.
గోల్కొండ కోటలో బీజేపీ జెండా ఎలా ఎగుర వేస్తారు : వీహెచ్‌
నిజాంను వ్యతిరేకి స్తున్న బీజేపీ నేతలు … గోల్కొండ కోటలోవారి పార్టీ జెండా ఎలా ఎగుర వేస్తా రని మాజీ ఎంపీ వి హనుమంతరావు ప్రశ్నిం చారు. తెలంగాణ తెచ్చింది ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేన న్నారు. హైదరాబాద్‌ పాతబస్తీలోనూ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.
తెలంగాణలోనూ కర్నాటక ఫలితాలు : శ్రీధర్‌బాబు
మన రాష్ట్రంలో కూడా కర్నాటక ఫలితాలు పునరావృత్తం అవుతాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు.
దేశంలో బీజేపీపై వ్యతిరేకత ఉందన్నారు. తొమ్మిదేండ్లకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఎలా మోసం చేసిందో చెప్పేందుకు కార్యా చరణ రూపొందిస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలతో పాటు, కాంగ్రెస్‌ చేయబోయే కార్యక్రమాలను ప్రజల్లో కి తీసుకెళతామన్నారు.

Spread the love