పందులను చంపబోయి..

– ఏపీలో చిన్నారికి తగిలిన తూటా
కాకినాడ:  ఏపీలో ఘోర విషాదం చోటు చేసుకుంది. తుపాకీ తూటకు ఓ నాలుగేండ్ల చిన్నారి బలి అయ్యింది. కాకినాడ జిల్లా వెలమకొత్తూరులో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో పందులను వేటాడేందుకు వేటగాళ్లు అనుమతులు లేకుండా నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. అదే ప్రాంతంలో తోటి పిల్లలతో ఆడుకుంటున్న పలివెల ధన్యశ్రీకి దురదృష్టావశాత్తు తూటా తగిలింది. దీంతో ఆమె కుప్ప కూలి మృతి చెందింది. ఈ విషయాన్ని ధన్యశ్రీ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు పరుగున వచ్చి చూసేసరికి అప్పటికే పాప ప్రాణం విడిచింది. స్థానికుల సమాచారం మేకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నాటు తుపాకీని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

Spread the love