Wednesday, June 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంచింతలమానేపల్లిలో మళ్లీ పోడు వివాదం

చింతలమానేపల్లిలో మళ్లీ పోడు వివాదం

- Advertisement -

పోడు రైతులు, అటవీ అధికారుల మధ్య వాగ్వాదం
రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మా సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం : రైతులు
అవి అటవీ భూములు : ఎఫ్‌డీవో

నవతెలంగాణ-చింతలమానేపల్లి
కుమురం భీం-ఆసిఫాబాద్‌ జిల్లా చింతల మానేపల్లి మండలంలోని దిందా గ్రామంలో పోడు భూముల వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారి తీసింది. అటవీ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగం గా మంగళవారం అటవీ శాఖ అధికారులు భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లగా, స్థానిక పోడు రైతులు అడ్డుకున్నారు. ఎఫ్‌ఆర్‌వో సుభాష్‌ ఆధ్వర్యంలో అటవీ శాఖ సిబ్బంది ట్రాక్టర్ల సాయం తో మొక్కలు నాటేందుకు యత్నించగా.. తమ సాగు భూముల్లో పనులు చేయొద్దంటూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరు గ్రూపుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొందరు గ్రామ స్తులు అటవీ శాఖ వాహనాల ముందు బైటాయిం చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘ టనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు లోకి తీసుకొచ్చారు. డీఎస్పీ వైహిదుద్దీన్‌, సీఐ సంతోష్‌ కుమార్‌, ఎస్‌ఐ కమలాకర్‌ ఆధ్వర్యంలో కొంత మంది పోడు రైతులను అదుపులోకి తీసుకుని కాగజ్‌నగర్‌ ఫారెస్ట్‌ డివిజన్‌ కార్యాలయానికి తరలిం చారు. పోడు భూముల సమస్యపై కొంత కాలంగా రైతులు, అటవీ శాఖ అధికారుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. అధికారులు అటవీ భూముల ను పరిరక్షించే చర్యలు చేపడుతుండగా, రైతులేమో.. తాము తరతరాలుగా పోడు సాగు చేస్తున్న భూము లపై హక్కులు కల్పించి పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. అటవీ అధికారులు మహిళలు, వృద్ధులను సైతం చూడకుండా తమపై బలప్రయోగం చేసి అక్కడి నుంచి తరలించారని రైతులు ఆరోపించారు. తమ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

ఆక్రమణలో అటవీ భూములు : ఎఫ్‌డీవో
కర్జెల్లి రేంజ్‌ పరిధిలో అటవీ భూములు పెద్దఎత్తున ఆక్రమణకు గురయ్యాయని, దిందా ప్రాంతంలో 1,600 ఎకరాల భూమిలో ఆక్రమణలు ఉన్నాయని ఎఫ్‌డీవో అప్పయ్య తెలిపారు. అందులో 800 ఎకరాల్లో తాత్కాలికంగా స్థానిక రైతులు సాగు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టు చెప్పారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -