రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్ గా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు

నవతెలంగాణ – హైదరాబాద్: వచ్చే ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ విచ్చేస్తున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ను ఆహ్వానించినట్టు కేంద్ర అధికారిక వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రావాల్సి ఉంది. అయితే, వివిధ కారణాల వల్ల తాను రాలేనని బైడెన్ చెప్పినట్టు సమాచారం. దీంతో ఫ్రాన్స్ అధ్యక్షుడిని భారత ప్రభుత్వం ఆహ్వానించింది. మరోవైపు ఈ ఏడాది జులైలో ప్యారిస్ లో జరిగిన ఫ్రాన్స్ జాతీయ దినోత్సవమైన బాస్టిల్ డే పరేడ్ కు ప్రధాని మోదీ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్ లో ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సుకు మెక్రాన్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బాస్టిల్ డే పరేడ్ కు మోదీ హాజరు కావడాన్ని తమ దేశ ప్రజలు గౌరవంగా భావిస్తున్నారని చెప్పారు.

Spread the love