అర్జెంటీనాలో ప్రజల ఆగ్రహం

నవతెలంగాణ – బ్యూనస్ ఎయిర్స్ : అర్జెంటీనాలోని విశ్వవిద్యాలయాలలో ప్రెసిడెంట్ జేవియర్ మిల్లే అమలు చేసిన పొదుపు చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు జరుగుతున్నాయి. విద్యార్థులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లతో పాటు లక్షలాది మంది కార్మిక సంఘాల కార్యకర్తలు, ప్రతిపక్ష రాజకీయ పార్టీల కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొన్నారు. డిసెంబరులో జేవియర్ మిల్లే అధికారాన్ని చేపట్టిన తర్వాత అర్జెంటీనాలో జరిగిన అతిపెద్ద నిరసనలు ఇవే. బ్యూనస్ ఎయిర్స్‌లో కొన్ని గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. యూనివర్సిటీలను మూసివేసే స్థితికి తీసుకొచ్చిన విధానపరమైన విధానాలను విరమించుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

Spread the love