పుష్పరాజ్‌ సందడి మొదలైంది

పుష్పరాజ్‌ సందడి మొదలైందిప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప-2 ది రూల్‌’. ‘పుష్ప ది రైజ్‌త’ో ప్రపంచ సినీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకోవడమే ఇందుకు కారణం. ఇక ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సీక్వెల్‌ పుష్ప-2 ది రూల్‌ గురించి తాజాగా చిత్ర యూనిట్‌ ఇచ్చిన అప్‌డేట్‌ అందర్నీ సర్‌ప్రైజ్‌ చేసింది. ఈ చిత్రం నుంచి మే డే సందర్శంగా తెెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషల్లో ‘పుష్ప….. పుష్ప… పుష్ప… పుష్పరాజ్‌’ అంటూ సాగే తొలి లిరికల్‌ వీడియోను విడుదల చేశారు మేకర్స్‌. అల్లు అర్జున్‌ హీరోగా డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప ది రైజ్‌.. ‘ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 2021 బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది పుష్ప. అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు.. తనకు జాతీయస్థాయి అవార్డు తెచ్చి పెట్టిన చిత్రంగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. దీంతో దీనికి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం పై భారీ అంచనాలు పెరిగాయి. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్‌ వైడ్‌గా విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్‌, రష్మిక మందన్న, ఫహాద్‌ ఫాజిల్‌, ధనుంజరు, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్‌, నిర్మాతలు: నవీన్‌ ఏర్నేని, వై రవిశంకర్‌, సినిమాటోగ్రఫర్‌: మిరోస్లా క్యూబా బ్రోజెక్‌, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌.

Spread the love