నాణ్యమైన విత్తనాలు అందజేయాలి

నవతెలంగాణ – గంగాధర : ఖరీఫ్ సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని గంగాధర ఎస్సై అభిలాష్ సూచించారు. గంగాధర మండల కేంద్రంలోని రైతు వేదిక సమావేశ భవనంలో నిర్వహించిన ఫర్టిలైజర్, ఫర్టీసీడ్స్ దుకాణదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టే ప్రయత్నం చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. నాణ్యమైన విత్తనాలు అందించకుండా నకిలీ విత్తనాలు అందిస్తే రైతులు పెట్టిన పెట్టుబడులు, శ్రమ వృధా అవుతుందనే విషయాన్ని దుకాణదారులు గ్రహించాలన్నారు. అన్నం పెట్టే రైతన్నను అన్ని విధాల ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పురుగు మందులు, విత్తనాల విషయంలో రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. దుకాణ యజమానులను లైసెన్స్ కలిగి ఉండి ప్రభుత్వం ఆదేశాలు పాటించాలని అన్నారు. ఈ సమావేశంలో గంగాధర అగ్రికల్చర్ ఆఫీసర్ కోట శ్వేత, దుకాణదారులు పాల్గొన్నారు .

Spread the love