టాస్క్‌తో రత్నదీప్‌ రిటైల్‌ ఒప్పందం

హైదరాబాద్‌ : ప్రముఖ రిటైల్‌ చెయిన్‌ అయిన రత్నదీప్‌ తాజాగా తెలంగాణ ప్రభుత్వం, అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌), రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌ఏఐ)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి, టాస్క్‌ సీఈఓ శ్రీకాంత్‌ సిన్హా, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేష్‌ రంజన్‌, రత్నదీప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ యష్‌ అగర్వాల్‌ ఈ ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్నారు. వరల్డ్‌ యూత్‌ స్కిల్‌ డే సందర్భంగా చేసుకున్న భాగస్వామ్యంలో భాగంగా ”రత్నదీప్‌ రిటైల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌”ను స్థాపించనునున్నట్టు పేర్కొంది. ఇది రిటైల్‌ పరిశ్రమలో యువ ఔత్సాహికులకు సమగ్ర నైపుణ్యాభివృద్థి అవకాశాలను అందిస్తుందని తెలిపింది. వచ్చే ఏడాది కాలంలోనే రిటైల్‌ రంగంలో 10,000 మందికి నైపుణ్యాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని యష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ఈ సంస్థకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్నాటక రిటైల్‌ సెంటర్లున్నాయి.

Spread the love