రెడ్‌ సెల్యూట్‌ సుందరయ్యా…

ఒకరో ఇద్దరో
వారసులుంటే అది
రక్త సంబంధం

లక్షలాది మంది నీ
వారసులుంటే అది
కమ్యూనిస్టు సంబంధం!

పిల్లలు లేరని మీకు
ఎవరంటారు చెప్పు!
మా చూపుల్లో మీ రూపం
చూడకుండా ఉంటారా!

అందరూ నావాళ్ళేనని
అనుకున్నారు మీరు
అందుకే మీ ఆశయానికి
వారసులమయ్యాం మేము
ఈ తెలుగు నేల నిన్నుకనీ
ధన్యభూమిగా మారింది
నీ చరితను భరతజాతి
నింపుకొని మెరిసింది!

త్యాగాలను తనువంతా
కప్పుకొని బ్రతికినోళ్ళు
నీలాంటి నిప్పులాంటి
నేతలు మాకున్నందుకు
గర్వంగా, ధైర్యంగా
మునుముందుకు పోతున్నం

సుందరయ్యా! మా సుందరయ్యా
మా అందరి అడుగుజాడ నీవయ్యా!
కామ్రేడ్‌ సుందరయ్యా! సుందర కామ్రేడువయా!

– కె. ఆనందాచారి

Spread the love