మంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకుంటున్న ఆర్ఐ రవీందర్

– ఉత్తమ ఆర్ఐగా రవీందర్
నవతెలంగాణ-వీణవంక
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ అధికారులు నిర్వహించిన సేవలకు గాను అందించే పతకాలల్లో భాగంగా వీణవంక ఆర్ఐ గోనెల రవీందర్ ఉత్తమ ఉద్యోగిగా ఎంపికయ్యాడు. కాగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్ర్య ఉత్సవాలల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రశంసాపత్రం మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ గోపి, సీపీ సుబ్బరాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. కాగా ఈ సందర్భంగా రవీందర్ ను అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.

Spread the love