రాబిన్‌హుడ్‌ క్రిస్మస్‌ కానుకగా రిలీజ్‌

రాబిన్‌హుడ్‌ క్రిస్మస్‌ కానుకగా రిలీజ్‌వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాబిన్‌ హుడ్‌’ సినిమాలో హీరో నితిన్‌ మునుపెన్నడూ లేని తరహా పాత్రలో అద్భుతంగా కనిపించబోతున్నారు. ఆయన గెటప్‌ నుండి క్యారెక్టరైజేషన్‌ వరకు నితిన్‌ని పూర్తిగా డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో దర్శకుడు ప్రెజెంట్‌ చేస్తున్నారు. అతన్ని దొంగగా పరిచయం చేసిన టీజర్‌ హాస్యభరితంగా ఉండగా, బర్త్‌ డే గ్లిమ్ప్స్‌ పూర్తి యాక్షన్‌ ప్యాక్డ్‌గా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో అత్యున్నత స్థాయి నిర్మాణ, సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాని డిసెంబర్‌ 20న విడుదల చేయాలని మేకర్స్‌ డిసైడ్‌ అయ్యారు. క్రిిస్మస్‌ సెలవులు, ఆ తర్వాత న్యూ ఇయర్‌ సెలవులు ఈ సినిమాకి కలిసి రానున్నాయి. కమర్షియల్‌ అంశాలే కాకుండా తగినంత వినోదాన్ని కలిగి ఉండే సినిమాకి ఇది సరైన విడుదలని భావిస్తున్నారు.

Spread the love