ఆర్టీసీ కార్మికులకు సర్కారీ జీతాలు

– కొత్త బస్సులు, డిపోలు, స్టేషన్లు ఉండవు
– అభివృద్ధి కోసమే ఆర్టీసీ ఆస్తుల వినియోగం
– చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ కార్మికులకు మరో నెలరోజుల్లో ప్రభుత్వ ట్రెజరీ నుంచి వేతనాలు అందుతాయని టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌ తెలిపారు.
శుక్రవారం నాడాయన్ని కలిసిన పాత్రికేయులతో మాట్లాడారు. సాధ్యమైతే ఈనెల జీతాలనే ట్రెజరీ ద్వారా ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామనీ, సాంకేతిక సమస్యలు ఏవైనా ఎదురైతే కచ్చితంగా వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. విలీన ప్రక్రియపై ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా అధ్యయనం చేస్తున్నారనీ, అవన్నీ ఓ కొలిక్కి వచ్చాక విధివిధానాలు ఖరారు అవుతాయని వివరించారు. ఆర్టీసీ కార్మికులకు ప్రస్తుతం అదనపు అలవెన్సులు ఇవ్వట్లేదనీ, దానిపై వారిలో కొంత అసంతృప్తి ఉన్నదని అన్నారు. విలీన ప్రక్రియ పూర్తయితే గతంలో కంటే మరింత మెరుగైన జీతాలు, అలవెన్సులు వస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) యథాతధంగానే ఉంటుందనీ, ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వంలో విలీనం అవుతున్నారని వివరణ ఇచ్చారు. వారి జీతాలను ప్రభుత్వం చెల్లిస్తే, సంస్థకు రోజువారీగా వచ్చే ఆదాయంతో అప్పులు తీరుస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల కష్టం ఇప్పటిలాగే ఉంటుందనీ, దానిలో ఎలాంటి తేడా ఉండబోదన్నారు. సంస్థ ఆస్తుల్ని అభివృద్ధి, విస్తరణకే వినియోగిస్తామని చెప్పారు. కొత్త బస్సుల్ని కొనాలనే ప్రణాళికలు ఏవీ ప్రస్తుతం లేవని తేల్చి చెప్పారు. కొత్త
ఆర్టీసీ కార్మికులకు సర్కారీ జీతాలు డిపోలు, బస్టేషన్లు కూడా ఉండబోవన్నారు. బ్రెడ్‌ విన్నర్‌ స్కీం కొనసాగుతుందనీ, ఇప్పటికి 170 మందికి ఈ స్కీం క్రింద ఉద్యోగాలు ఇచ్చామనీ, మరో 500 మంది పెండింగ్‌లో ఉన్నారని అన్నారు. త్వరలోనే ఉద్యోగుల విలీన ప్రక్రియ పూర్తిఅవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Spread the love