Sunday, June 7, 2026
E-PAPER
Homeదర్వాజప్రత్యామ్నాయ సాంస్కృతిక కావ్యం శూద్రగంగ

ప్రత్యామ్నాయ సాంస్కృతిక కావ్యం శూద్రగంగ

- Advertisement -

తెలంగాణ దుక్కుల్లో పుట్టి తెలుగు నేలంతా పాటల పరిమళమై అల్లుకున్నవాడు. తెలుగుజాతి గర్వపడేలా జాతీయ ఉత్తమ సినీ గేయ రచయిత అవార్డ్ అందుకున్న కవి, రచయిత సుద్దాల అశోక్ తేజ. జీవనవృత్తిలో భాగంగా సినిమా పాటలు రాయడమే ఆయన ప్రధాన పని. కానీ ఆయన ఆలోచనా ప్రవృత్తి మాత్రం సదా సకల జనుల గురించే ఆలోచిస్తుంది. కనుకనే ఆయనకు ఎవరూ రాయమని చెప్పకున్నా ప్రజా పాటలు రాస్తుంటాడు. మిగతా పాటల రచయితలకు భిన్నంగా కవిత్వం కూడా రాశాడు. అది కూడా మామూలు కవిత్వం కాదు దీర్ఘ కవిత్వం (Long poems) రాస్తున్నాడు. అట్లా ఇప్పటి వరకు సామాజిక పరిణామ క్రమానికి శ్రమనే మూలమని చెప్పే – ‘శ్రమకావ్యం’, మనుషుల జీవనానికి ప్రకృతే ఆధారమని తీర్మానించిన – ‘నేను అడవిని మాట్లాడుతున్నాను’, అని రెండు దీర్ఘ కావ్యాలు రాశాడు. ఆ పరంపరలో భాగంగానే తన అస్తిత్వ మూలాలను వెతుక్కుంటూ మూడవదిగా “శ్రీ శూద్రగంగ” ప్రత్యామ్నాయ సాంస్కృతిక కావ్యాన్ని పట్టుకొచ్చాడు. గంగను అంటే నీరు శూద్రజాతికి చెందినదని చెప్తూ, నీటికి శూద్రత్వాన్ని ఆపాదించి మన ముందు నిలబెట్టాడు.

గంగ ప్రవాహాన్ని, గంగా ప్రయాణాన్ని వర్ణించాలి అంటే ‘ఆహా గంగ, ఓహో గంగ, రమణీయ గంగ, రస రమ్య గంగ, రయ్యి రయ్యిమంటూ సుడులు తిరుగుతూ హొయలొలుకుతూ వడి వడిగా అత్యంత సుందరం ఈ గంగ అని వర్ణిస్తుంటారు. ప్రాచీన కవులు. “తరుణీ రూపునఁ జూపట్టెఁ దగ నొయ్యారంపుఁ బయ్యెదన్” అని గంగను వర్ణించిన పోతనను విన్నాం. దానికి భిన్నంగా “ఆ బొంత చేనేత మెత్తందనంగా/ ఆ నేత నానమ్మ కుట్టినవిధంగా/కమ్మగా చెమ్మగా కదిలింది గంగ’ (శ్రీ శూద్రగంగ. పుట. 100) అని నేతపని చేసి జనానికి కప్పుకొనే బట్ట నందించే చేనేతల చెలిమిగా కవి సుద్దాల అశోక్ తేజ గంగను వర్ణిస్తున్నాడు. బ్రాహ్మణులు ‘మన్మథుడి కామబాణంలా’ అని గంగను వర్ణిస్తే, “సకల జలచరములకు అమ్మ ఒడిగా” (పుట. 105) అని గంగమ్మతనాన్ని గుర్తుచేస్తున్నాడు అశోక్ తేజ. “చెమట చుక్కలేని/ కన్నీటి చుక్కరాని/ చుక్కల లోకాల నుండి/ చెక్కేస్తున్నది గంగ/ నీలిరంగు మేడ విడిన/ నేలతల్లి గూడు వలచి/ అవని చిగురు సాగు కొరకు” (పుట. 55) అంటూ ఆకాశమేడను కాదని, పేదోడి గూడెం వైపు వస్తున్నది గంగ. నిజానికి దేవతలు ఎప్పుడైనా ఉన్నోళ్లవైపే ఉంటారు. పేదోడి వైపు కన్నెత్తి కూడా సూడరు. కానీ గంగ అట్లా కాదు. కాళ్లకు మట్టి అంటని లోకంలో, చెమట, కన్నీరు రాని లోకంలో ఒక్క క్షణం కూడా ఉండలేనని నేల మీది మట్టికోసం, మనుషుల కోసం, మట్టి మనుషుల కన్నీళ్లు కడగడం కోసం, పంటలు పండడం కోసం గంగ వచ్చింది. అంటున్నాడు కవి.

“భారతాన సురలు – దొరలు/ సృష్టించిన కరువు పైన/ అసహనాన్ని ప్రకటించిన’ (పుట. 44) అని పైలోకం సురలను, భూమిపైన దొరలనూ ఒకటే జాతి కింద జమకట్టింది గంగ. సురలు అనగా ‘సురపానం’ తాగేవారు, అంటే దేవతలు అని అర్థం. వారు శూద్ర జనాలకు తాగడానికి, సాగు చేసుకోవడానికి నీళ్ళు ఇవ్వకుండా గొంతు ఆరిపోయేలా చేసి అడ్డుపడ్డారు. దేవేంద్రుడి వృత్తాంతం మొత్తం అదే. అట్లా ఆయన లాగానే ఇల మీద భూబకాసురలైన దొరలు కూడా బక్క జనాలకు నీళ్ళు ఇవ్వకుండా కృత్రిమ కొరత సృష్టించారు. దీవిలో దేవళ్ళు, భువిలో దొరలు ఒకే రీతిన వ్యవహరించడాన్ని చూసిన గంగ వారిది అగ్రవర్ణ పక్షపాతమని భావించి అసహనంతో ఇట్లా నేల మీదికి వచ్చిందంటున్నాడు కవి. “దప్పిక పడే ప్రజల యెదల/ డొప్పలు నింపాలని’ (పుట. 49) అవని మీదికి గంగ వచ్చిన తీరును వర్ణిస్తూ ఓ వైపు దేవతల కుట్రను బహిర్గతం చేస్తూనే, మరోవైపు శూద్ర జన దాహర్తి బాధను, వేదనను వెలిబుచ్చుతున్నాడు కవి. “శ్రీ ద్రావిడ భూపతి/ రావణ ప్రజాపతికి పది తలలు అతికించిన/ యతిసంగ పరివారమే/బడుగు గంగవైన నిన్ను/ భగీరథిగ మలిచినది/ దానకర్తయగు బలి/ చక్రవర్తిని క్రూర దానవుని చేసిన/ దౌర్జన్య ముని సంగపరివారమే/నిను భగీరథుని తపః ఫలిత/ పాత్రగా మార్చినది” (పుట.50) ఇట్లా మూలవాసులను, యోధులను, దయార్థ హృదయ రాజులను, వన సుందరీ మణులను, యోధురాల్లను తప్పుగా, తమకిష్టమొచ్చిన అబద్దాలతో అసురలని, వికార రూపిణులని ప్రచారం చేస్తూ వేల ఏళ్లుగా బ్రాహ్మణులు ప్రజలను నమ్మిస్తున్నారు. అంటూ ఆ కుటిల నీతి పరివారపు కుట్రలను బట్టబయలు చేస్తున్నాడు శూద్రకవి సుద్దాల అశోక్ తేజ.

“ఉరుమిష్టమని/ తెలిసిన మన మాలల/ ఉరుము నృత్యమా/ డప్పు చప్పుడిష్టమని/ నిప్పుల దరువై ధ్వనించే/డప్పు అభిజాత్యమా/ ఏ తాటి మోకుల ధ్వని/ ఏ కొలిమి శ్వాస/ ఏ కుమ్మరి సారి/ ఏ సముద్ర జాలరి/ ఏ రాట్నపు రాగం/ రజకుల హం హం హం/ సబ్బండ జాతి చెమట బొట్ల/ టప టప టప టపనా/ బండ చాకిరీ రెక్కల/ రెప రెప రెప రెపనా” (పుట. 47) గంగ దేన్ని ఇష్టపడి భూమ్మీదికొచ్చినదో! గంగకు శబ్దం ఇష్టం, నృత్యం ఇష్టం, పాట ఇష్టం, అమ్మజోలపాట మరీ ఇష్టం, శ్రమ ఇష్టం, చెమట చుక్క ఇష్టం, శ్రమలోంచి వచ్చే శబ్దాలు అంటే ఎంతో ఇష్టం. ఇట్లా సుద్దాలకు తన ఇష్టాల లిస్టేదో పెద్దగనే చెప్పినట్లుంది. “తెల్లని గంగమ్మ/ నల్లని యమునతో/ మట్టిలో ప్రవహించు/ చామనఛాయ సరస్వతీ నదితో/ సంగమించి భిన్నత్వమున/ఏకత్వమును చాటినది” (పుట. 111) అంటూ ఇలా సదుల్లో కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడం అశోక్ తేజకు మానవాళి పట్ల, భారత రాజ్యాంగం పట్ల, రాజ్యాంగం ఆదేశిస్తున్న ప్రజాస్వామిక వైవిధ్యం పట్ల ఉన్న నమ్మకానికి మచ్చుతునక. నీటికే ఇంత భిన్నత్వంలో ఏకత్వం ఉంటే మనుషులకు ఎంత ఉండాలో, దేశానికెంత ఉండాలో అర్థం చేసుకోవాల్సిన అవసరతను ఈ కవితా పాదాల ద్వారా నొక్కి వక్కానిస్తున్నాడు అశోక్ తేజ.

ఇది ఒకే దేవుడు, ఒకే మతం, ఒకే తిండి, ఒకే భాష అని చెప్పే కాషాయ కుట్రగాళ్ళకు శూద్రగంగ కావ్యం బలమైన సమాధానంగా నిలుస్తుంది. “తేట తెలుపు చీర/ సెలయేటి సురగ రైక/ నీటి వెండి పట్టీలు/ పన్నీటి తడల కడియాలు/మట్టిదారి జాడలో/ జలపుటండియలు/ ఘల్లుఘల్లుమన/ నడిచొస్తున్నది గంగ/ నగుమోముతో నయగారంగా” (పుట.56) అంటూ నీటిలోని గుణాలను తీసుకొని, గంగకు ఆహార్యాలుగా, ఆభరణాలుగా మలిచి చెప్పడంలో అశోక్ తేజ వర్ణణా నైపుణ్యం ప్రస్పుటమైతుంది. నీటిలోని తేటదనాన్ని చీరగా, సెలయేరు ప్రవాహంలో వచ్చే సురగను జాకెట్టుగా, నీటిని వెండి పట్టీలుగా, నీటి అలలను కడియాలుగా, ఆ అలల చప్పుడును అందెలుగా, మన్నును జున్నుగా మార్చి, శూద్ర జగతి జానెడు పొట్టకు బుక్కెడు బువ్వ పెట్టడం తనకు ఇష్టమైనందున, నవ్వుతూ నడిచొస్తుంది గంగ. అంతే కానీ ఏ అగ్రవర్ణాల శవాల బూడిదెలు తడిపి కడిగేటందుకు మాత్రం అస్సలు కాదని తీర్మానిస్తున్నాడు. శూద్రగంగ ఈ దేశ మట్టిబిడ్డల గొంతుక. నెర్రలుబాన నేల పొరలలో నుండి వినిపిస్తున్న జాతీయగీతం. తడి ఆరి పిడుగట్టుకపోయిన దేశం నాలుకపై జలఊట శూద్రగంగ కావ్యం. తరతరాలుగా యుగయుగాలుగా రాయి – రప్ప, కొండ – కోన, తట్ట – బుట్ట, పార- పలుగు, నాగలి- కర్రు, చేసు చెలకలతో సహవాసం చేస్తున్న అలుపెరగని కష్టజీవికి ఒక నమ్మకమిస్తూ ఈ అవనిపై చేస్తున్న పచ్చని సంతకం శ్రీ శూద్రగంగ. నేటి ఏక ఛత్రాధిపత్య భావజాలపు ఎడారిలో సుద్దాల అశోక్ శూద్రతేజ తన అక్షర వర్షంతో చేస్తున్న జల సంతకం ఈ శూద్రగంగ.

తెలంగాణ దుక్కుల్లో పుట్టి తెలుగు నేలంతా పాటల పరిమళమై అల్లుకున్నవాడు. తెలుగుజాతి గర్వపడేలా జాతీయ ఉత్తమ సినీ గేయ రచయిత అవార్డ్ అందుకున్న కవి, రచయిత సుద్దాల అశోక్ తేజ. జీవనవృత్తిలో భాగంగా సినిమా పాటలు రాయడమే ఆయన ప్రధాన పని. కానీ ఆయన ఆలోచనా ప్రవృత్తి మాత్రం సదా సకల జనుల గురించే ఆలోచిస్తుంది. కనుకనే ఆయనకు ఎవరూ రాయమని చెప్పకున్నా ప్రజా పాటలు రాస్తుంటాడు. మిగతా పాటల రచయితలకు భిన్నంగా కవిత్వం కూడా రాశాడు. అది కూడా మామూలు కవిత్వం కాదు దీర్ఘ కవిత్వం (Long poems) రాస్తున్నాడు. అట్లా ఇప్పటి వరకు సామాజిక పరిణామ క్రమానికి శ్రమనే మూలమని చెప్పే – ‘శ్రమకావ్యం’, మనుషుల జీవనానికి ప్రకృతే ఆధారమని తీర్మానించిన – ‘నేను అడవిని మాట్లాడుతున్నాను’, అని రెండు దీర్ఘ కావ్యాలు రాశాడు. ఆ పరంపరలో భాగంగానే తన అస్తిత్వ మూలాలను వెతుక్కుంటూ మూడవదిగా “శ్రీ శూద్రగంగ” ప్రత్యామ్నాయ సాంస్కృతిక కావ్యాన్ని పట్టుకొచ్చాడు. గంగను అంటే నీరు శూద్రజాతికి చెందినదని చెప్తూ, నీటికి శూద్రత్వాన్ని ఆపాదించి మన ముందు నిలబెట్టాడు.

గంగ ప్రవాహాన్ని, గంగా ప్రయాణాన్ని వర్ణించాలి అంటే ‘ఆహా గంగ, ఓహో గంగ, రమణీయ గంగ, రస రమ్య గంగ, రయ్యి రయ్యిమంటూ సుడులు తిరుగుతూ హొయలొలుకుతూ వడి వడిగా అత్యంత సుందరం ఈ గంగ అని వర్ణిస్తుంటారు. ప్రాచీన కవులు. “తరుణీ రూపునఁ జూపట్టెఁ దగ నొయ్యారంపుఁ బయ్యెదన్” అని గంగను వర్ణించిన పోతనను విన్నాం. దానికి భిన్నంగా “ఆ బొంత చేనేత మెత్తందనంగా/ ఆ నేత నానమ్మ కుట్టినవిధంగా/కమ్మగా చెమ్మగా కదిలింది గంగ’ (శ్రీ శూద్రగంగ. పుట. 100) అని నేతపని చేసి జనానికి కప్పుకొనే బట్ట నందించే చేనేతల చెలిమిగా కవి సుద్దాల అశోక్ తేజ గంగను వర్ణిస్తున్నాడు. బ్రాహ్మణులు ‘మన్మథుడి కామబాణంలా’ అని గంగను వర్ణిస్తే, “సకల జలచరములకు అమ్మ ఒడిగా” (పుట. 105) అని గంగమ్మతనాన్ని గుర్తుచేస్తున్నాడు అశోక్ తేజ. “చెమట చుక్కలేని/ కన్నీటి చుక్కరాని/ చుక్కల లోకాల నుండి/ చెక్కేస్తున్నది గంగ/ నీలిరంగు మేడ విడిన/ నేలతల్లి గూడు వలచి/ అవని చిగురు సాగు కొరకు” (పుట. 55) అంటూ ఆకాశమేడను కాదని, పేదోడి గూడెం వైపు వస్తున్నది గంగ. నిజానికి దేవతలు ఎప్పుడైనా ఉన్నోళ్లవైపే ఉంటారు. పేదోడి వైపు కన్నెత్తి కూడా సూడరు. కానీ గంగ అట్లా కాదు. కాళ్లకు మట్టి అంటని లోకంలో, చెమట, కన్నీరు రాని లోకంలో ఒక్క క్షణం కూడా ఉండలేనని నేల మీది మట్టికోసం, మనుషుల కోసం, మట్టి మనుషుల కన్నీళ్లు కడగడం కోసం, పంటలు పండడం కోసం గంగ వచ్చింది. అంటున్నాడు కవి.

“భారతాన సురలు – దొరలు/ సృష్టించిన కరువు పైన/ అసహనాన్ని ప్రకటించిన’ (పుట. 44) అని పైలోకం సురలను, భూమిపైన దొరలనూ ఒకటే జాతి కింద జమకట్టింది గంగ. సురలు అనగా ‘సురపానం’ తాగేవారు, అంటే దేవతలు అని అర్థం. వారు శూద్ర జనాలకు తాగడానికి, సాగు చేసుకోవడానికి నీళ్ళు ఇవ్వకుండా గొంతు ఆరిపోయేలా చేసి అడ్డుపడ్డారు. దేవేంద్రుడి వృత్తాంతం మొత్తం అదే. అట్లా ఆయన లాగానే ఇల మీద భూబకాసురలైన దొరలు కూడా బక్క జనాలకు నీళ్ళు ఇవ్వకుండా కృత్రిమ కొరత సృష్టించారు. దీవిలో దేవళ్ళు, భువిలో దొరలు ఒకే రీతిన వ్యవహరించడాన్ని చూసిన గంగ వారిది అగ్రవర్ణ పక్షపాతమని భావించి అసహనంతో ఇట్లా నేల మీదికి వచ్చిందంటున్నాడు కవి. “దప్పిక పడే ప్రజల యెదల/ డొప్పలు నింపాలని’ (పుట. 49) అవని మీదికి గంగ వచ్చిన తీరును వర్ణిస్తూ ఓ వైపు దేవతల కుట్రను బహిర్గతం చేస్తూనే, మరోవైపు శూద్ర జన దాహర్తి బాధను, వేదనను వెలిబుచ్చుతున్నాడు కవి. “శ్రీ ద్రావిడ భూపతి/ రావణ ప్రజాపతికి పది తలలు అతికించిన/ యతిసంగ పరివారమే/బడుగు గంగవైన నిన్ను/ భగీరథిగ మలిచినది/ దానకర్తయగు బలి/ చక్రవర్తిని క్రూర దానవుని చేసిన/ దౌర్జన్య ముని సంగపరివారమే/నిను భగీరథుని తపః ఫలిత/ పాత్రగా మార్చినది” (పుట.50) ఇట్లా మూలవాసులను, యోధులను, దయార్థ హృదయ రాజులను, వన సుందరీ మణులను, యోధురాల్లను తప్పుగా, తమకిష్టమొచ్చిన అబద్దాలతో అసురలని, వికార రూపిణులని ప్రచారం చేస్తూ వేల ఏళ్లుగా బ్రాహ్మణులు ప్రజలను నమ్మిస్తున్నారు. అంటూ ఆ కుటిల నీతి పరివారపు కుట్రలను బట్టబయలు చేస్తున్నాడు శూద్రకవి సుద్దాల అశోక్ తేజ.

“ఉరుమిష్టమని/ తెలిసిన మన మాలల/ ఉరుము నృత్యమా/ డప్పు చప్పుడిష్టమని/ నిప్పుల దరువై ధ్వనించే/డప్పు అభిజాత్యమా/ ఏ తాటి మోకుల ధ్వని/ ఏ కొలిమి శ్వాస/ ఏ కుమ్మరి సారి/ ఏ సముద్ర జాలరి/ ఏ రాట్నపు రాగం/ రజకుల హం హం హం/ సబ్బండ జాతి చెమట బొట్ల/ టప టప టప టపనా/ బండ చాకిరీ రెక్కల/ రెప రెప రెప రెపనా” (పుట. 47) గంగ దేన్ని ఇష్టపడి భూమ్మీదికొచ్చినదో! గంగకు శబ్దం ఇష్టం, నృత్యం ఇష్టం, పాట ఇష్టం, అమ్మజోలపాట మరీ ఇష్టం, శ్రమ ఇష్టం, చెమట చుక్క ఇష్టం, శ్రమలోంచి వచ్చే శబ్దాలు అంటే ఎంతో ఇష్టం. ఇట్లా సుద్దాలకు తన ఇష్టాల లిస్టేదో పెద్దగనే చెప్పినట్లుంది. “తెల్లని గంగమ్మ/ నల్లని యమునతో/ మట్టిలో ప్రవహించు/ చామనఛాయ సరస్వతీ నదితో/ సంగమించి భిన్నత్వమున/ఏకత్వమును చాటినది” (పుట. 111) అంటూ ఇలా సదుల్లో కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడం అశోక్ తేజకు మానవాళి పట్ల, భారత రాజ్యాంగం పట్ల, రాజ్యాంగం ఆదేశిస్తున్న ప్రజాస్వామిక వైవిధ్యం పట్ల ఉన్న నమ్మకానికి మచ్చుతునక. నీటికే ఇంత భిన్నత్వంలో ఏకత్వం ఉంటే మనుషులకు ఎంత ఉండాలో, దేశానికెంత ఉండాలో అర్థం చేసుకోవాల్సిన అవసరతను ఈ కవితా పాదాల ద్వారా నొక్కి వక్కానిస్తున్నాడు అశోక్ తేజ. ఇది ఒకే దేవుడు, ఒకే మతం, ఒకే తిండి, ఒకే భాష అని చెప్పే కాషాయ కుట్రగాళ్ళకు శూద్రగంగ కావ్యం బలమైన సమాధానంగా నిలుస్తుంది.

“తేట తెలుపు చీర/ సెలయేటి సురగ రైక/ నీటి వెండి పట్టీలు/ పన్నీటి తడల కడియాలు/మట్టిదారి జాడలో/ జలపుటండియలు/ ఘల్లుఘల్లుమన/ నడిచొస్తున్నది గంగ/ నగుమోముతో నయగారంగా” (పుట.56) అంటూ నీటిలోని గుణాలను తీసుకొని, గంగకు ఆహార్యాలుగా, ఆభరణాలుగా మలిచి చెప్పడంలో అశోక్ తేజ వర్ణణా నైపుణ్యం ప్రస్పుటమైతుంది. నీటిలోని తేటదనాన్ని చీరగా, సెలయేరు ప్రవాహంలో వచ్చే సురగను జాకెట్టుగా, నీటిని వెండి పట్టీలుగా, నీటి అలలను కడియాలుగా, ఆ అలల చప్పుడును అందెలుగా, మన్నును జున్నుగా మార్చి, శూద్ర జగతి జానెడు పొట్టకు బుక్కెడు బువ్వ పెట్టడం తనకు ఇష్టమైనందున, నవ్వుతూ నడిచొస్తుంది గంగ. అంతే కానీ ఏ అగ్రవర్ణాల శవాల బూడిదెలు తడిపి కడిగేటందుకు మాత్రం అస్సలు కాదని తీర్మానిస్తున్నాడు. శూద్రగంగ ఈ దేశ మట్టిబిడ్డల గొంతుక. నెర్రలుబాన నేల పొరలలో నుండి వినిపిస్తున్న జాతీయగీతం. తడి ఆరి పిడుగట్టుకపోయిన దేశం నాలుకపై జలఊట శూద్రగంగ కావ్యం. తరతరాలుగా యుగయుగాలుగా రాయి – రప్ప, కొండ – కోన, తట్ట – బుట్ట, పార- పలుగు, నాగలి- కర్రు, చేసు చెలకలతో సహవాసం చేస్తున్న అలుపెరగని కష్టజీవికి ఒక నమ్మకమిస్తూ ఈ అవనిపై చేస్తున్న పచ్చని సంతకం శ్రీ శూద్రగంగ. నేటి ఏక ఛత్రాధిపత్య భావజాలపు ఎడారిలో సుద్దాల అశోక్ శూద్రతేజ తన అక్షర వర్షంతో చేస్తున్న జల సంతకం ఈ శూద్రగంగ.

ఎ. విజయ్ కుమార్, 9573715656

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -