విద్యా క్షేత్రంగా సిద్దిపేట నియోజకవర్గం

గ్రామాల్లో బీఆర్‌ఎస్వీ ఆత్మీయ సమ్మేళనాలు
నవతెలంగాణ-నంగునూరు
సిద్దిపేట నియోజకవర్గాన్ని విద్యా క్షేత్రంగా మార్చారని బీఆర్‌ఎస్వీ సిద్దిపేట నియోజకవర్గ సమన్వయ కర్త నార్లపురం రాంమోహన్‌, మండల పరిశీలకులు భూక్యా బిక్షపతి నాయక్‌ మండల అధ్యక్షులు గోవిందారం రవిలు అన్నారు. గురువారం సిద్దిపేట నియోజకవర్గం నంగునూరు మండలంలోని ముండ్రాయి, తిమ్మాయిపల్లి గ్రామాలలో మండల బిఆర్‌ఎస్వి అధ్యక్షులు గోవిందారం రవి అధ్యక్షతన బీఆర్‌ఎస్వీ విద్యార్థి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేజీ నుంచి ఎంబీబీఎస్‌, అగ్రికల్చర్‌, వెటర్నరీ, బి ఫార్మసి వంటి పెద్ద చదువులు చదివే చదువుల నిలయంగా సిద్దిపేట నియోజకవర్గంను తీర్చిదిద్దారని తెలిపారు. విద్యార్ధి యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో నంగునూరు మండలంలో డీఎక్ష్‌ఎన్‌ కంపెనీ, ఆయిల్‌ ఫాం ఫ్యాక్టరీ వంటి వాటిని నెలకొల్పి ఉపాధి కల్పిస్తున్నాడన్నారు. మంత్రి హరీశ్‌ రావు ఆధ్వర్యంలోనే అనేక కొత్త ఉద్యోగ నోటిఫికేషన్‌లు వస్తున్నాయని విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముండ్రాయి సర్పంచ్‌ బెంద్రం కమలాకర్‌ రెడ్డి, తిమ్మాయిపల్లి సర్పంచ్‌ ఏల లత కష్ణ, మాజీ సర్పంచ్‌ మల్యాల నర్సింలు,కలకుంట్ల నర్సింలు, వెంకటేశం,గుండెల్లి రాజయ్య,చేర్యాల రాజు పాల్గొన్నారు.ఆయా గ్రామాల ముఖ్య నాయకులు ఆధ్వర్యంలో ముండ్రాయి బీఆర్‌ఎస్వీ గ్రామ శాఖ అధ్యక్షులుగా బొంగు శ్రీకాంత్‌, ఉపాధ్యక్షులుగా సంపత్‌, ప్రధాన కార్యదర్శిగా సోహెల్‌ 18 మందితో పూర్తి కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే విధంగా తిమ్మాయిపల్లి గ్రామ శాఖ అధ్యక్షులుగా మల్యాల శ్రీకాంత్‌, ఉపాధ్యక్షులుగా చేర్యాల శ్రీకాంత్‌, ప్రధాన కార్యదర్శిగా పి. సాయి కుమార్‌,18 మందితో పూర్తి కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్వీ నియోజవర్గ ప్రధాన కార్యదర్శి పావురాల అశోక్‌, మండల ఉపాధ్యక్షులు అప్పాల శేఖర్‌ యాదవ్‌,చల్లారం మహేందర్‌ రెడ్డి, సోషల్‌ మీడియా ఆకారం రాజేందర్‌,మల్యాల నరేష్‌ యాదవ్‌, తెలు రఘు,కష్ణ,రాజు,యాకోబ్‌ రెడ్డి, చరణ్‌,జగన్‌, నరేష్‌,కొలిపాక బాబు,కె. రాజు,ఎ. రాజు, రాజశేఖరరెడ్డి, సాయి, ప్రవీణ్‌, రాజేందర్‌, శ్రీకాంత్‌, రాకేష్‌, ప్రణరు, వెంకటేష్‌, మల్యాల రవి, శ్రీకాంత్‌, సాయి తదితరులు పాల్గొన్నారు.

Spread the love