స్క్వాష్‌ పోటీలు ఆరంభం

హైదరాబాద్‌ : తెలంగాణ స్క్వాష్‌ క్లోజ్డ్‌ చాంపియన్‌షిప్స్‌ శుక్రవారం ఆరంభమయ్యాయి. హైదరాబాద్‌లోని హైటెక్‌ ఎరీనా గేమ్‌పాయింట్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో ఎనిమిది విభాగాల్లో 100 మంది క్రీడాకారులు పోటీపడుతున్నారు. తెలంగాణ స్వ్కాష్‌ రాకెట్స్‌ సంఘం నిర్వహిస్తున్న ఈ టోర్నీలో జూనియర్‌ ప్లేయర్లు తనుజ్‌ రెడ్డి, అర్నా ద్వివేది, సాన్వి శ్రీ సహా టాప్‌ ర్యాంకర్లు రోహన్‌ ఆర్యగోండి, ఐశ్వర్య పయ్యన్‌లు బరిలో నిలిచారు.

Spread the love