మంత్రి చేతులగా మీదుగా ప్రశంసా పత్రం అందుకుంటున్న ఎస్సై ఆసీప్

– ఉత్తమ ఎస్సైగా ఎండీ ఆసీప్
నవతెలంగాణ-వీణవంక
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ అధికారులు నిర్వహించిన సేవలకు గాను అందించే పతకాలల్లో వీణవంక ఎస్సై ఎండీ ఆసీప్ ఉత్తమ ఎస్సైగా ఎంపికయ్యాడు. కాగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్ర్య ఉత్సవాలల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ప్రశంసాపత్రం మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ గోపి, సీపీ సుబ్బరాయుడు అందజేశారు. అలాగే ఉత్తమ హెడ్ కానిస్టేబుల్ గా రమణారెడ్డి, రైటర్ సారయ్య బెస్ట్ రైటర్ తో పాటు అతి ఉత్కృష్ట్ పతకానికి ఎంపికయ్యారు. వీరు కూడా మంత్రి, కలెక్టర్, సీపీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. కాగా ఎస్సై ఆసీప్, హెడ్ కానిస్టేబుల్ రమణారెడ్డి, రైటర్ సారయ్యను ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందించారు.

Spread the love