నవ, యువ తోరణాలుగా రాష్ట్ర క్రీడా ప్రాంగణాలు

– సీఎం కప్‌తో జిల్లాల్లో జోష్‌
– ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో
 – విజేతలకు పతకాలు అందజేసిన ఆంజనేయగౌడ్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
సీఎం కప్‌తో జిల్లాల్లో జోష్‌ పెరిగింది. ఉత్సాహ భరిత వాతావరణంలో ఆటల పోటీలు జరుగుతు న్నాయి. క్రీడా ప్రాంగణాలు కిక్కిరిపోయాయి. విజేత లకు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మెడల్స్‌ అందజేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో సీఎం కప్‌ పోటీల్లోని విజేత లకు శాట్స్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయగౌడ్‌ పతకాలను అందజేశారు. జిల్లా కేంద్రంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో జరుగుతున్న సీిఎం కప్‌ పోటీల సంద ర్బంగా క్రీడా పోటీల తీరుని ఆయన పర్యవేక్షించారు. క్రీడా పోటీల్లో తల పడుతున్న జట్లను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఖోఖో, బాస్కెట్‌ బాల్‌, రైఫీల్‌ షూట్‌లలో ఆడి క్రీడాకారులను ఉత్సాహపరి చారు. జిల్లా డీివైఎస్‌ఓ పరంధామ రెడ్డి బీఆర్‌ఎస్‌ జిల్లా యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కష్ణ చైతన్య తో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శాట్స్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడీల్లో 617 మండల కేంద్రాలలో నాలుగున్నర లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. ఖమ్మం జిల్లా లోని మండలా ల్లోనే పదహేను వందల మందికిపైగా క్రీడాకారులు పాల్గొన్నారని చెప్పారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ క్రీడా కారులను తయారు చేయడమే లక్ష్యంగా క్రీడలను ప్రోత్సహిస్తు న్నామని తెలిపారు. రాష్ట్రంలో 17వేల క్రీడా ప్రాంగా ణాలను నిర్మించామని, వాటిని కేర్‌ టెకర్లుగా సంరక్షించుకో వాలని సూచించారు.
ప్రభుత్వ ప్రోత్సాహంతో అంతర్జాతీయ స్థాయిలో నిజామాబాద్‌కు చెందిన నిఖత్‌ జరిన్‌, ఈషాసింగ్‌, కొత్తగూడెంకి చెందిన క్రికె టర్‌ త్రిష, చెస్‌లో గ్రాండ్‌ మాస్టర్‌గా నిలిచిన ఆదిత్య లాంటి వారు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నా రని వివరించారు. క్రీడా కారులకు ప్రొఫెషనల్‌ కోర్సు ల్లో 0.5శాతం, ప్రభుత్వ ఉద్యోగాలలో రెండు శాతం ఇస్తూ క్రీడాకారులను ప్రోత్సాహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పీఈటీల అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ రామకష్ణ, స్థానిక ప్రజా ప్రతినిధు లు,క్రీడాకారులు, పీఈటీలు, కోచ్‌లు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా కేంద్రంలో
నల్గొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్‌ స్టేడియంలో జరుగుతున్న జిల్లా స్థాయి సీఎం కప్‌ పోటీల సందర్బంగా స్థానిక శాసన సభ్యులు కంచెర్ల భూపాల్‌రెడ్డితో కలిసి ఆంజనేయగౌడ్‌ క్రీడా పోటీలు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. అనంతరం ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మెన్‌ సైదిరెడ్డి, గ్రంధా లయం చైర్మెన్‌ రెగట్టే మల్లికార్జున్‌రెడ్డితో కలసి విలేకర్ల సమావేశంలో ఆంజనేయగౌడ్‌ మాట్లాడారు. సీఎం కప్‌కి అద్భుతమైన స్పందన వస్తున్నదని అన్నా రు. దేశంలో ఎక్కడ లేని విధంగా క్రీడాకారులకు జూబ్లీహిల్స్‌ లాంటి ప్రాంతాలలో ఖరీదైనా 600 గజా ల ఇండ్ల స్థలాలు, అత్యున్నత నగదు పురస్కారాలు ఇస్తూ క్రీడాకారులను ప్రోత్సాహిస్తున్నట్టు తెలిపారు.

Spread the love