లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు..

నవతెలంగాణ-హైదరాబాద్ : అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 153 పాయింట్ల లాభంతో 62,181 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 37 పాయింట్లు లాభపడి 18,352 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.24 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా మోటార్స్‌, నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్‌, ఇన్ఫోసిస్‌, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతీ, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, రిలయన్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Spread the love