కథలు, కవితా సంపుటాలకు ఆహ్వానం!

ఖమ్మం ఈస్థటిక్స్‌ ఆధ్వర్యంలో అందిస్తున్న పురస్కారాలకు కథలు, కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నారు. ఉత్తమ కథలుగా ఎంపికైన వాటికి మొదటి, రెండవ, మూడవ బహుమతులుగా రూ.25వేలు, రూ.15వేలు, రూ.10 వేలు అందించనున్నారు. ఉత్తమ కవితా సంపుటికి రూ. 40 వేలు అందించనున్నారు. ఏప్రిల్‌ 2022 నుంచి మార్చి 2023 మధ్య ప్రచురితమైన సంపుటాలను మాత్రమే పంపించాలి. నవంబర్‌లో ఖమ్మంలో నిర్వహించే వేడుకలలో పురస్కార ప్రధానోత్సవం ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు కథలు, కవితా సంపుటాలను ఆగస్టు 31లోగా ఖమ్మం ఈస్ఘటిక్స్‌ సాహిత్య పురస్కా రాలు, హార్వెస్ట్‌ స్కూల్‌, 5-7-200/11, పాకబండ బజార్‌, ఖమ్మం – 507003 చిరునామాకు లేదా khammamaesthetics@ gmail.com  చిరునామాకు పంపవచ్చు. వివరాలకు 9849114369 నంబరు నందు సంప్రదించవచ్చు.
రవికుమార్‌

Spread the love