నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు..

నవతెలంగాణ – నసురుల్లాబాద్
ఫర్టిలైజర్స్‌ దుకాణాల్లో నకిలీ విత్తనాలు, ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సీడ్ టాస్క్ ఫోర్స్ టీమ్ వ్యవసాయ శాఖ అధికారిణి కమల అన్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో ఫర్టిలైజర్స్‌ దుకాణాలను శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులతో కలిసి తనిఖీ చేశారు. నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయంతో రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దుకాణాల్లో ఎరువులు, విత్తనాల విక్రయాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. విత్తనాలు, ఎరువులను విక్రయించిన సమయంలో రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలని సూచించారు. మండల రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీడ్ టాస్క్ ఫోర్స్ టీమ్ నుతన్ కుమార్, అమర్ ప్రసాద్, రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.

Spread the love