ప్రమాదానికి గురైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

నవతెలంగాణ – అశ్వారావుపేట
కొద్ది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి బుధవారం మృతి చెందాడు. ఎస్.హెచ్.ఒ ఎస్సై బీ రాజేశ్ కుమార్ కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని పేట మాలపల్లి చెందిన నార్సింగ్ కార్తీక్ (33) ద్విచక్రవాహనంపై ఈ నెల 11వ తేది రాత్రి నారంవారిగూడెం నుండి వస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో అడ్డుగా వచ్చిన గేదె ను ఢీ కొట్టాడు.దాంతో కార్తీక్ కు తీవ్ర గాయాలు కాగా ఖమ్మం లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు.పరిస్థితి విషమించి చికిత్స పొందుతున్న క్రమంలో మృతి చెందాడు. దీని పై భార్య అగ్నేష చేసిన లిఖిత పూర్వక ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Spread the love