సరైన మార్పుకి నాంది

మైత్రి.. ది ఫీమేల్‌ ఫస్ట్‌ కలెక్టీవ్‌ పేరుతో ప్రైమ్‌ వీడియో చెన్నైలో తొలి సెషన్‌ని రిలీజ్‌ చేసింది. ఐశ్వర్య రాజేష్‌, మాళవిక మోహనన్‌, మధుబాల వంటి నాయికలతోపాటు రేష్మ ఘటల, స్వాతి రఘురామన్‌, యామిని యజ్ఞమూర్తి, అపర్ణ పురోహిత్‌, స్మతి కిరణ్‌ వంటి తదితర సాంకేతిక నిపుణులు ముఖ్యంగా వినోద పరిశ్రమలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వీళ్ళంతా నటించారు. గురువారం ‘మైత్రి: ఫీమేల్‌ ఫస్ట్‌ కలెక్టివ్‌’ తాజా సెషన్‌ను విడుదల చేశారు. ఈ సెషన్‌లో అందరూ తమ వ్యక్తిగత కథనాలతోపాటు చిత్ర పరిశ్రమలో ఉన్న లింగ విబేధాల గురించి, స్టీరియోటైపింగ్‌, వర్ణవాదం, వయోవివక్ష మొదలైన వాటితో సహా, మహిళా వత్తినిపుణులు ఎదుర్కొంటున్న సవాళ్లు, రంగాలు వేరు అయినప్పటికీ అన్ని సమస్యలు ఒకే విధంగా ఉన్నాయని వీరందని అభిప్రాయాలతో వ్యక్తమైంది. మైత్రి సరైన దిశలో మార్పుని తెచ్చింది. మహిళలకు, యువతులకు సమాన ప్రాధాన్యత ఇస్తే వీళ్ళు సృష్టించే సరికొత్త ప్రపంచంతో చాలా మందికి ఉపాథి దొరికే అవకాశం ఉందన్నారు.

Spread the love