ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య..నడుము వరకే మృతదేహం

నవతెలంగాణ-వరంగల్: జిల్లాలోని శాయంపేట మండలంలోని మైలారం గ్రామానికి చెందిన గాజుల అశోక్ (35) గ్రామ శివారులోని గుట్టపైన చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోగా, గొర్ల కాపరి గుర్తించడంతో ఆదివారం వెలుగుచూసినట్లు ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం…. మైలారం గ్రామానికి చెందిన గాజుల అశోక్ కోమల దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమారుడు కలరు.  భార్యాభర్తలు కలిసి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అశోక్ ప్రతిరోజు కూలి పనికి వెళ్లి వచ్చిన డబ్బులతో మద్యం సేవించి  ప్రతిరోజు భార్యతో   గోడవ పడేవాడు.  చాలాసార్లు మందలించిన కూడా కూలీ డబ్బులు ఇంట్లో ఇవ్వకుండా త్రాగుచు  గోడవ పడేవాడు. ఈ క్రమంలో ఈనెల 3  న అశోక్ కూలీ పనికి వెళ్లకుండ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడటంతో, ఆమె తన పిల్లలను వెంటపెట్టుకొని  తల్లి గారి ఊరైన రాజక్కపల్లికి వెళ్ళింది. కోమల  అత్తగారైన గాజుల సమ్మక్క ఫోన్ చేసి నీ భర్త అశోక్ గత రెండు రోజుల నుండి ఇంటి వద్ద కనిపించడం లేదని, నీదగ్గరకు వచ్చినాడా అని  అడగడంతో, అశోక్ మద్యం తాగి ఇంట్లో నుండి వెళ్లిపోవడం అలవాటే కదా వస్తాడులే అని చెప్పినట్లు తెలిపారు.  నా భర్త తిరిగి ఇంటికి రాలేదని మా అత్త మరల నాకు 16న తెలియపరచడంతో,  మా బంధువులకు ఫోన్ చేసి తెలుసుకోగా అక్కడకు కూడా రాలేదని చెప్పినట్లు తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో మైలారం గ్రామానికి చెందిన గొర్ల కాపరి అయిన మసికే మహేందర్ మైలారం గ్రామం శివారులోని  గుట్టలలో చెట్టుకు ఉరివేసుకొని చనిపోయి ఉన్నాడని, అశోక్ శవాన్ని గుర్తించి అశోక్ సోదరుడు గాజుల బిక్షపతి గారికి తెలియపరచినట్లు తెలిపారు. బిక్షపతి వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పడంతో అందరూ కలిసి గుట్టకు వచ్చి చూడగా అశోక్ మోదుగు చెట్టుకు చీరతో ఉరివేసుకొని చనిపోయి ఉన్నాడని, నడుము భాగం వరకు గుర్తు తెలియని జంతువులు  తిని ఉండి, పై భాగం పూర్తిగా గుర్తించేటప్పుడు వీలు లేకుండా ఉన్నట్లు గుర్తించారు.  అశోక్ భార్య కోమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి  మృతదేహన్ని శవ పంచనామా నిమిత్తం పోస్ట్ మార్టంకు తరలించినట్లు ఎస్సై వీరభద్రరావు తెలిపారు.

Spread the love