విద్యా శాఖ డైరెక్టర్ ఆదేశాలు వెనక్కి తీసుకోవాలి…

– ఎస్ఎఫ్ఐ తెలంగాణ యూనివర్సిటీ కమిటీ డిమాండ్…
నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కెజిబివిలో, మోడల్ స్కూల్లలో డిఇవో అనుమతి లేకుండా విద్యార్థి సంఘాలను, మీడియాను లోపలికిరావడానికి అనుమతి లేదని విద్యా శాఖ డైరెక్టర్ దేవసేన ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్  ఎస్ఎఫ్ఐ తెలంగాణ యూనివర్సిటీ కమిటీ  డిమాండ్ చేస్తూ సోమవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఎస్ఐ యూనివర్సిటీ అధ్యక్ష కార్యదర్శులు లవిశెట్టి ప్రసాద్ , కె శ్రీశైలం  మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై 49 రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు యూనిఫామ్ లు ఇవ్వలేదన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో పుస్తకాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్రంలో ఖాళిగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు. ఇన్ని సమస్యలు | పాఠశాలలో ఉంటే, ఆ సమస్యలు తెలుసుకోని, పోరాడే వారిపై అంక్షాలు విదించడం సమంజసం కాదన్నారు. స్వాయాన సియం మనువడే ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారని అన్నారు. కెజిబివి లను కళాశాలను అప్ గ్రేడ్ చేసిన భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు- మన బడి పథకం కింద ఎంపిక చేసిన, ఆ నిధులు కాంట్రాక్టర్లకు అందాయి తప్ప, ఏ ఒక్క విద్యార్థికి మేలు చేసింది లేదన్నారు. తక్షణమే దేవా సేన ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని, లేని యెడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చారించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ సహాయ కార్యదర్శి వెంకటేష్ ఉపాధ్యక్షులు సంధ్యారెడ్డి కమిటీ సభ్యులు , నవీన్ ,  చిత్ర , దినేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love