డంపింగ్‌ యార్డ్‌ను తరలించాలి

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
 ఘటనా స్థలంలో ధర్నా
నవతెలంగాణ-మిర్యాలగూడ
మిర్యాలగూడ పట్టణంలోని కాలనీల మధ్య ఉన్న డంపింగ్‌ యార్డ్‌ను తరలించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని డంపింగ్‌ యార్డ్‌ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీల మధ్య డంపింగ్‌యార్డ్‌ ఉండటం వల్ల దుర్వాసన, చెత్తాచెదారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వ్యర్థాలను నిల్వ చేయడంతో దోమలు, ఈగలు స్వైరవిహారం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. వెంటనే యార్డును తరలిం చాలని, లేనిపక్షంలో ప్రజలను సమీకరించి బలమైన ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఏవో రాధకు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేశ్‌, సీనియర్‌ నాయకులు నూకల జగదీష్‌చంద్ర, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మూడావత్‌ రవినాయక్‌, డాక్టర్‌ మల్లు గౌతమ్‌రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, పరుశరాములు, శశిధర్‌రెడ్డి, ఎండి అంజాద్‌, గాయం వెంకటరమణా రెడ్డి, పాపారావు, ఫాతిమా భేగం, మున్ని, పాదూరి గోవర్థన, బాబునాయక్‌, గోవింద్‌రెడ్డి, వాడపల్లి రమేష్‌, కరిమున్నిసా బేగం పాల్గొన్నారు.

Spread the love